Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల పరిరక్షణలో కమిటీల పాత్ర ప్రధానమైనది
- బాలల స్నేహపూర్వక జిల్లాగా మార్చాలని పిలుపు
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు తన దృ ష్టికి వచ్చినట్లయితే తనే కేసులు పెట్టిస్తానని పంచా యతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు అన్నారు. మంగళవారం రోజున హను మకొండ వడ్డేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో హనుమ కొండ, వరంగల్ జిల్లాలకు చెందిన ఎంపీపీలు, స ర్పంచ్లకు బాలల పరిరక్షణ కమిటీ విధి విధానాలు అంశంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహిం చారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ క మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు కమిషన్ స భ్యులు కే.శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ చిన్నచిన్న సాకులతో, ఆర్థిక లేమి కారణంతో ముక్కు పచ్చలారని పిల్లలకు పెళ్లిల్లు చేసి వారి భవిష్యత్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని, ఇ లాంటి హేయమైన, చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడవద్దని, పిల్లలకు విద్యను ఆయుధంగా అందిం చి వారికి దిశా నిర్దేశనం చేయాలని పిలుపునిచ్చారు, బాల్యవివాహాలను ప్రోత్సహించిన, బాల్య వివాహాల ను జరిపిన సదరు వ్యక్తులపై కేసులు నమోదు చే యాలని సంబంధిత బాల్య వివాహ నిరోధక అధికా రులకు సూచించారు.
అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తె లంగాణ ప్రభుత్వం సంక్షే మ గురుకులపాఠశాల ద్వా రా పేద పిల్లలకు ఉచిత గురుకుల విద్యను అందించి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యనందిస్తుం దని, సంక్షేమ గురుకుల పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి ఉన్నత చదువులు చదివించాలని ఆకాంక్షిం చారు. గ్రామస్థాయిలో రక్షణ సంరక్షణ అవసరము న్న పిల్లలను గుర్తించి వారిసమస్యల పరిష్కారం కో సం కమిటీలు కృషి చేయాలని, బాలల హక్కుల పరి రక్షణలో కమిటీలు క్రియాశీలకంగా, బాధ్యతాయు తంగా, పారదర్శకంగా పనిచేయాలని అప్పుడే బాలల రక్షణ సంరక్షణ సాధ్యపడుతుందని హితవు పలికా రు. పిల్లలు సామాజిక మాధ్యమాల ప్రభావాలకు లో ను కాకుండా ప్రతీతల్లి తండ్రి జాగ్రత్తలు తీసుకోవా లని, కుటుంబ వ్యవస్థ ప్రధానమని ఆశించిన మార్పు రావాలంటే అది కుటుంబం నుండే రావాలని అన్నా రు. సభ్యతసంస్కారం చిన్ననాటి నుండే అలవర్చుకు న్న పిల్లలు వారి భవిష్యత్తు దిశా నిర్దేశం చేసుకుంటా రని అన్నారు. సంరక్షణ అవసరమున్న పిల్లలకు ప్ర భుత్వం కల్పించే సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించి లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికా రులకు సూచించారు.
మండల, పట్టణ, జిల్లా స్థాయిల్లో బాలల పరిర క్షణ కమిటీల పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ కషిచేసి బాలల స్నేహపూర్వక జిల్లాగా తగుచర్యలు తీసుకోవా లని సూచించారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కే.శోభారాణి మాట్లాడు తూ బాలలహక్కుల కమిషన్ బాలల హక్కుల పరి ర క్షణ దేయంగా పనిచేస్తూ జిల్లా జిల్లాలోని బాలల సం క్షేమ సమితి బాలల పరిరక్షణ విభాగం వారితో సమ న్వయం చేస్తూ సమస్యలు ఉత్పన్నమైన చోట అక్కడ కమిషన్ బెంచ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవలి కాలంలో హనుమకొండ జిల్లాలో బాల అదా లత్ ఏర్పాటు చేసి పిల్లల సమస్యలకు పరిష్కార వేది కగా నిలిచామన్నారు. అనంతరం బాలహక్కుల పరి రక్షణ కరదీపికలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చే తుల మీదుగా ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓలు ఆకవరం శ్రీనివాసకుమార్, ఎం. సంపత్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి వి.జగదీ శ్వర్, ఆర్జేడీ బి.ఝాన్సీ లక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధి కారులు ఎం.సబిత, ఎం శారద, బాల రక్షా భవన్ కో-ఆర్డినేటర్ కే.శిరీష, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ లు అన్నమనేని అనిల్ చందర్ రావు, కే.వసుధ, హనుమకొండ వరంగల్ జిల్లాలకు చెందిన సీడీపీ ఓలు, సూపర్వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు చైల్డ్‌లైన్ ప్రతినిధులు, వరంగల్ హనుమకొండ జిల్లాలకు చెందిన మున్సిపల్ చైర్పర్స న్లు, మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, తది తరులు పాల్గొన్నారు.