Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
హన్మకొండ బాలసము ద్రంలోని కుడా మైదానం (హయ గ్రీవ చారి మైదానం)లో ఫన్అం డ్ జారు వాటర్ టన్నెల్ ఫిష్ మ్యూజియం ఎగ్జిబిషన్‌ను సోమ వారం సాయంత్రం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ వేసవికాలం సెలవులలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, పిల్లలు పెద్దలు అందరూ చల్లని సాయంత్రం వేళ సందర్శించి ఉల్లాసంగా ఉత్సాహంగా మానసిక ప్రశాంతతను పొందాలని ఆయన కోరారు. అనంతరం ఎగ్జిబిషన్ యాజమాని అ స్లాం మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్‌ను హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీస్ ప్రజలకోసం 500 రకాల సముద్ర జలచరాలతో అండర్‌వాటర్ టన్నెల్ ఫిష్ అక్వే రియంను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మేనేజర్లు డి. రా జేంద్రప్రసాద్, ఫిరోజ్, 30వ డివిజన్ కార్పొరేటర్ రావుల కోమలకిషన్, స్థానిక పోలీస్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.