Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామపంచాయతీని ఎంపీడీవో రవీంద్రనాథ్ మంగళవారం సందర్శించి గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఏర్పాటుచేసిన వన నర్సరీని సందర్శించి ఫీల్డ్ అసిస్టెంట్‌కు, పంచాయతీ కార్యదర్శికి తగు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వన సేవకుల ద్వారా మొక్కలకు నీటిని పట్టించాలని ఆదేశించారు. వారి వెంట ఉపాధి హామీ ఏపీఓ రమేష్ , పంచాయతీ కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, తదితరులు ఉన్నారు.