Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
జిల్లా కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి శ్రీరామకృష్ణ సేవా ట్రస్టు వ్యవస్థాపక అద్యక్షుడు బాడిశ నాగ రమేష్తో కలిసి పార్టీ కార్యకర్తలు, యువకులు భారీగా తరలివెల్లారు. మంగళవారం మండలంలోని రాజుపేట, రమణక్కపేట, మంగపేట, కమలాపురం గ్రామాలకు చెందిన ట్రస్టు సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. కొంత కాలంగా నాగ రమేష్ ట్రస్టు ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ సామాజిక, ఆర్ధిక సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో నాగ రమేష్ జిల్లా కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ విస్తత స్థాయి కార్యకర్తల సమావేశానికి భారీగా తన అనుచరులతో వాహనాల్లో బయలుదేరడం చర్చనీయాంశమైంది. నాగ రమేష్ బీఆర్ఎస్లో చేరి ములుగు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ములుగు టికెట్ ఆశిస్తున్న వారికి నాగ రమేష్ చేరిక మింగుడుపడేలా లేదని ప్రచారం జరుగుతున్నా రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.