Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ జిల్లా అధ్యక్షులు ముంజల బిక్షపతిగౌడ్
నవతెలంగాణ- ములుగు
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని జేఏసీ జిల్లా అధ్యక్షులు ముంజల బిక్షపతిగౌడ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద ప్రభుత్వ అతిథి గృహంలో గిరిజన సంక్షేమ శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్‌తో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గట్టమ్మ వద్ద స్థల సేకరణ పూర్తి అయినదని, రైతులకు కూడా నష్టపరిహారం ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో గట్టమ్మ వద్ద ములుగు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. వైటిసి భవనంలో తాత్కాలికంగా తరగతులు ప్రారం భించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో తరగతులు ప్రారంభమ య్యాయని, మొదటి సెమిస్టర్ పరీక్ష కూడా పూర్తయిందన్నారు. వెంటనే ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ వద్ద గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభించాలని, ములుగు జిల్లాలోని వైటిసి భవనం జాకారంలో తరగతులు ప్రారంభించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ గురించి మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో గడ్డం క్రాంతి కుమార్, ములుగు జిల్లా జేఏసీ నాయకులు పాల్గొన్నారు.