Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలో సంచరించే 108, 102 వాహనాల సిబ్బంది ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిద్దంగా ఉండాలని 108, 102 వాహనాల జిల్లా కో ఆర్డినేటర్ మెరుగు నరేష్ అన్నారు. మంగళవారం మంగపేట ప్రాథమిక ఆస్పతి ఆవరణలో 108, 102 వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనాలు, సిబ్బంది పని తీరును పరిశీలించి విధుల్లో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ కేసులు ఎక్కవ వచ్చే అవకాశాలుం టాయని ప్రజలకు ప్రథమ చికిత్స అందజేయడానికి సిద్దంగా ఉండాలన్నారు. వాహనాలను అందులోని పరికరాల ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మంచి కండిషన్ లో ఉంచుకోవాలన్నారు. కేసుల విషయంలో సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు.