Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఐకేపీ వీఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని అన్ని గ్రామాల సమాఖ్య వీఓఏలు మంగళవారం అక్కల ప్రమిలా అధ్యక్షతన నిరవ ధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనేక సంవత్స రాలుగా తమకు తక్కువ వేతనాలు ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .గౌరవ వేతనం వద్దని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సాధారణ బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలు వ్యక్తిగత ఖాతాల్లో వేయాలని, సెర్ప్ నుంచి గుర్తించి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.