Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కానుకలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా వాజేడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీటీసీ తల్లడి పుష్పలత, ఎంపీడీఓ విజయ ఆధ్వర్యంలో ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ కిసరి రాజు, జూనియర్ సహాయకులు సిహెచ్ కిరణ్, గ్రామ రెవెన్యూ సహాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.