Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తోర్రూర్ డివిజన్ కార్యదర్శి ఆలకుంట్ల సాయిలు
నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురు మండలం ఐకెపి సెర్ఫ్ కార్యాల యంలో వివిధ గ్రామాలలో వివోఎలుగా విధులు నిర్వహిస్తున్న వారికి తక్షణమే సెర్ఫ్ ఉద్యోగులుగా గు ర్తించకపోతే పోరాటాన్ని ఉధృతం చేసి ఉద్యమిస్తా మని సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తొర్రూర్ డివి జన్ కార్యదర్శి ఆలకుంట్ల సాయిలు ప్రభుత్వాన్ని హె చ్చరించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యా లయం ముందుసెర్ఫ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె మూడోరోజుకు సంఘీభావం తెలిపి బుధవారం ఆయన మాట్లాడారు. ఈ సెర్ఫ్ కార్యాలయంలో వివి ధ గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న వివోలకు చాలీ చాలని వేతనాలు ఇస్తూ వారితో వెట్టి చాకిరి చేయిం చుకోవడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను కూడా గ్రామస్థాయిలో వీరితో ప్రచారం చేయించుకుంటూ కనీసం గుర్తింపు ఇవ్వకపోవడం ఎంతవరకు సమం జసమని ఆయన ప్రశ్నించారు. మహిళా పొదుపు సం ఘాలకు సంబంధించిన గ్రూపుల సభ్యులను ఒక వేది క ఏర్పాటు చేసి వారి రికార్డులను రాస్తూ వారికి లోన్ ఇప్పిస్తూ ఎవరైనా కట్టకపోతే వారి ఇంటి చుట్టూ తిరిగి రికవరీ చేయించి లావాదేవీలను నడిపిస్తూ చాలీచాలని వేతనంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారు. వీరిని తక్షణమే సెర్ఫ్ ఉద్యోగులుగా నియమించి ఉద్యోగ భద్రత కల్పించి అర్హత కలిగిన వివోఏలను సీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ బీమా సౌకర్యం ఇప్పించాలని, ఎవరి ఒత్తిడి లేకుండా నేరు గా వారి అకౌంట్లో వేతనాన్ని జమ చేయాలని డిమాం డ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26వేల రూపాయలు వీరికి అందిం చాలని డిమాండ్ చేశారు. జిల్లా రాష్ట్రస్థాయిలో వీరం దరి కలుపుకొని పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల మండల గౌర వ అధ్యక్షుడు బిరు యాకయ్య, మండల వివోఏల సంఘం అధ్యక్షుడు గుగులోతు హనుమంతు, సమ్మె కన్వీనర్ ఇందిరా, వివోఏలు శ్వేత నసీహత్ బేగం, విజయలక్ష్మి, కవిత, అక్కెర ఉష, చింతకుంట్ల ఉపేం దర్, మంజుల, గట్టు అశోక్, గడ్డల అశోక్, హైమావ తి వివిధ గ్రామాల వివోఏలు పాల్గొన్నారు.
మూడవ రోజుకు చేరిన వివోఏల దీక్షలు
గార్ల : రాష్ట్ర ప్రభుత్వం వివోఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.వివోఏల సమస్యలను పరిష్కరిం చాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ ఐకేపి ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) అధ్వర్యంలో స్దానిక నెహ్రూ సెంటర్లో చేపట్టిన సమ్మె బుధవా రం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివోఏల చేతవెట్టి చాకిరీ పను లు చేయిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వారికి పనికి తగిన వేతనం చెల్లించడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధిస్తున్న ప్రభుత్వం వారి సమ స్యలను పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. గత కొంత కాలంగా వివోఏలు అనేక రకాలుగా నిరస నలు చేపట్టిన స్పందించక పోవడంతో సమ్మె చేస్తు న్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వివోఏల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయా లని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు కాంగ్రెస్ నాయ కులు టి.కృష్ణ, షంషాద్ బేగం, యం.వినోద, యం.రాములు సంఘిభావం తెలిపారు.దీక్షలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు కందుల శోభ, సిహెచ్ మౌనిక, బి.ఉమా, వినోద, అనిత, జ్యోతి, అరుణ, ర మ, కల్పనా, లక్ష్మీ, సునీత, చంద్రకళ, సరోజ, సురేష్, మంగ్యి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి
గూడూరు : వీవోఏలు చేపట్టిన నిర్వాదిక సమ్మె మూడో రోజుకు చేరింది. బుధవారం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని తమ వంతు కృషిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని అన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సం ఘీభావ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్య క్షురాలు నునావత్ రాధా, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు నునావత్ రమేష్, మండల అధ్యక్షులు కత్తి స్వా మి, అధ్యక్షుడు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, మైనారిటీ రాష్ట్ర నాయకులుయాకూబ్ పాషా, కాంగ్రె స్ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, మాజీ యూత్ అధ్యక్షుడు బుడిగే సతీష్, యూనియన్ అధ్య క్షురాలు దారం శ్రీలత, కోశాధికారి మల్లె పోయిన శ్రీల త, క్లస్టర్ బాధ్యులు పాల్గొన్నారు.