Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సివిల్ సప్లరు మేనేజర్ సంధ్యారాణి
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య సూచనలు, సల హాలు, ఆదేశాలతో రైతులతో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పక్కాప్రణాళితో ధాన్యం కొ నుగోళ్ళు చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నెర వేరుస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సంధ్యారాణి తెలిపారు.ప్రతిసీజన్లో కూడా ధాన్యం కొనుగోళ్ళలో రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులందరూ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. లాంఛనంగా ఇప్పటికే దేవరుప్పుల మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించిన విషయం తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా రబీ (ఎండా కాలం) సీజన్ ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభం కానున్న నేపధ్యంలో 'నవతెలంగాణ' బుధవారం ఆమెతో ముఖాముఖిగా ముచ్చటించింది.
ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేశారు..?
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు అంచనా వేశారు. వారి అంచనా మేరకు కొనుగోళ్ళ లక్ష్యాన్ని నిర్దేశించు కున్నాం. అందరి సహకారంతో సమన్వయంతో పని చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.
గన్నీస్ అందుబాటులో ఉన్నాయా..?
ధాన్యం కొనుగోళ్ళ లక్ష్యం మేరకు జిల్లాకు 57 ల క్షల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని ప్రతిపా దించాం. ఇప్పటి వరకు 35లక్షలు జిల్లాకు చేరుకున్నా యి. మిగతావి దశల వారీగా సరఫరా అవుతుంటా యి. గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూసుకుంటాం.
కొనుగోలు కేంద్రాలు ఎన్ని..?
జిల్లా వ్యాప్తంగా 200 ధాన్యం కొనుగోలు కేంద్రా లను నిర్వహించాలని నిర్ణయించాం. జిల్లా గ్రామీణా భివృద్ది శాఖ ఆధ్వర్యంలో 111, సహకార శాఖ ఆధ్వ ర్యంలో 89 కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంతా ల్లో ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఎక్కడైతే ఏర్పాటు చేశామో ప్రస్తుతం కూడా అక్కడే కొనుగోళ్లు చేపట్టేం దుకు చర్యలు తీసకుంటున్నాం.
రవాణా ఏర్పాట్ల గురించి చెప్పండి..?
జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించే విషయంలో రాజీ పడేది లేదు. కొనుగోళ్ళు పూర్తి కాగేనే వెంటనే ధాన్యాన్ని మిల్లర్లకు తరలించా ల్సిందే. ఇందు కోసం ఒక్కో కొనుగోలు కేంద్రానికి 2 లారీల చొప్పున జిల్లా వ్యాప్తంగా మొత్తం 400 లారీల ను, డిసిఎంలను సిద్దంగా ఉంచాం. అవసరమైతే మరిన్ని వాహనాలను కూడా సమకూర్చేందుకు వెనుకాడబోం.
రా మిల్లులకెంత...బాయిల్డ్ మిల్లులకెంత..?
రా రైస్ మిల్లులకు, బాయిల్డ్ రైస్ మిల్లులకు ధా న్యం కేటాయింపులో తేడాలుండవు. రా రైస్ మిల్లులు కేవలం రా రైస్ మాత్రమే ఇవ్వాల్సి ఉండగా బాయిల్డ్ మిల్లులు బాయిల్డ్ రైస్, రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మిల్లుకు ఎంత ధాన్యం కేటాయింపు అనేది ఆయా మిల్లుల సామర్ధ్యం, యంత్ర పరికరాలను బట్టి నిర్ణ యం ఉంటుంది.
అంచనాకు మించి ధాన్యం వస్తే..?
ప్రస్తుతం అధికారులు ఇచ్చిన అంచనా మేరకు ధాన్యాన్ని నిలువ చేసేందుకు జిల్లాలో ఏర్పాట్లు ఉన్నా యి. ప్రస్తుతమున్న జిల్లాలోని మిలుల్లో ఆ మేరకు వ సతి ఉంది. గతంలో అంచనాకు మించి రావడం వల్ల నే సూర్యాపేట లాంటి ఇతర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించిన మాట వాస్తవమే. ప్రస్తుతం అటువంటి పరిస్థితి రాదనే అనుకుంటున్నాం. ఒకవేళ అంచనాకు మించి ధాన్యం వచ్చినా ఎలాంటి ఇబ్బందులుండవు.
సీఎంఆర్ గురించి చెప్పండి..?
కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) 2021-22 ఖరీఫ్ (వర్షా కాలం)లో మిల్లర్లు 100 శాతం ఇచ్చా రు. 2021-22 రబీ (ఎండా కాలం)లో ఇప్పటి వర కు 92 శాతం ఇచ్చారు. మిగిలిన 8 శాతం సిఎంఆర్ రైస్ ఈ నెలాఖరు వరకు అందజేస్తామని ఇటీవల జరిగిన మిల్లర్ల సమావేశంలో మిల్లర్లుహామి ఇచ్చారు.
బయట కొనుళ్ళపై మీ నియంత్రణ ఉంటుందా..?
బయట రైస్ మిల్లర్లు చేసుకునే వ్యాపార లావా దేవీలతో మాకు సంబంధం ఉండదు. వారు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అటువంటి దానిపై మా పర్చవేక్షణ ఏమి ఉండదు. మేము నిర్వ హించే కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర లభి స్తుండగా రైతులు తక్కువ ధరకు ఎందుకు విక్రయిం చుకుంటారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిం చాలని, విక్రయించిన ధాన్యానికి తగిన రసీదును పొందాలని ఆమె సూచించారు.