Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని గూడూరు గ్రామ శివారు జానక పురం గ్రామానికి చెందిన గుండె శ్రీను తన ఇద్దరు కు మార్తెలను చంపేందుకు థంసప్లో విషం ఇచ్చిన ఘటన ఘటన తెలిసిందే. ఆ ఘటనలో పెద్ద కుమార్తె ప్రియా (10), చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం లో గతవారం రోజులక్రితం మృతి చెందడంతో, మెరు గైన వైద్యం కోసం రెండవ కుమార్తె నందిని (7)ని హై దరాబాదు గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషం కలిపిన తంసప్ తాగడంతో నందిని మృత్యువుతో పో రాడుతూ బుధవారం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో కసాయి తండ్రి ఘాతుకానికి ఇద్దరు కుమార్తెలు మృత్యువాత పడడంతో గూడూరు గ్రామ శివారు జానకిపురంలో విషాదం నెలకొంది. భార్యాభర్తల గొడవలు ఇద్దరు ఆడపిల్లల ప్రాణాలు తీశాయని గ్రామస్తులు వాపోయారు. తంసప్లో విషం కలిపి ఇద్దరు కుమార్తెలను చంపాలనుకున్న నిందితుడు శ్రీనును మొదటి కుమార్తె చనిపోయిన వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పాలకుర్తి ఎస్సై తాళ్ల శ్రీకాంత్ తెలి పారు. భార్యాభర్తల గొడవలతో ఎవరు పిల్లలకు విషం ఇవ్వకూడదని, ఇలాంటి ఘాతుకాలకు పాల్పడరాదని సూచించారు. పంతాలకు వెళితే పసి మొగ్గల ప్రాణా లు గాలిలో కలుస్తాయని తెలిపారు.