Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
మండలంలోని లకావత్ తండ గ్రామ నిరుపేద కుటుం బానికి చెందిన లౌడియా ప్రమీల-రవీందర్ దంపతుల కుమా రుడికి ఫీవర్తో న్యూమోనియా రావడంతో ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని డాక్టర్లు తెలిపారు. డబ్బులు ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత లేకపోవడంతో లకావత్తండా ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని యువ నాయకుడు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన శ్రీకాంత్ గౌడ్ చిన్నారి కుటుంబ సభ్యులకు బుధవారం 35 వేల రూపాయల నగదు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వ మల్లేష్, ధర్మపురం ఎంపీటీసీ లౌడియా ఉపేందర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లకవత్ లాలు, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.