Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
కేంద్ర ప్రభుత్వం అందజేసిన అవార్డులలో తెలంగా ణలో 13 గ్రామపంచాయతీలకు అవార్డులు రావడం పట్ల బుధవారం అర్చక జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మతోపాటు, శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ డైరెక్టర్ కోడూరు నరసింహారెడ్డిలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి అభినందనలు తెలిపారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాదంతో పాటు శేష వస్త్రాలతో మంత్రి ఎర్రబెల్లిని సత్కరించారు. ఈ సందర్భంగా డివిఆర్ శర్మ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నుండి గ్రా మాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్రం అందించే అవార్డుల స్ఫూర్తితో తెలంగాణలోని మరి న్ని గ్రామాలు అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.