Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
రాష్ట్రంలో ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాసాలు ఘ నంగా జరుపుకునేందుకు ప్రభుత్వం దావత్ ఏ ఇఫ్తార్ విందు లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే నన్నపనేని నరేం దర్ అన్నారు. ట్రిమ్స్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ ఈద్గాలో ఏ ర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, కుడా చైర్మ న్ సుందర రాజన్ యాదవులతో కలిసి విచ్చేసిన ఆయన ము స్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు వరంగల్ తూర్పులో ఇఫ్తార్ విందులను ఘ నంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్,కార్పొరేటర్లు పురన్, సిద్ధం రాజు, దిడ్డి కుమారస్వామి, చాంద్ పాషాఅహ్మద్,జ బ్బార్, అంజాద్, ఈద్గా కమిటీ సభ్యులు ముస్లింలు పాల్గొన్నారు.
కులం మతాలకతీతంగా పండుగలను జరుపుకోవాలి
ఆత్మకూర్ : అందరు కలిసిమెలిసి ఉండడమే కాకుండా కులం మతాలకు అతీతంగా పండుగలు జరుపుకున్నప్పుడు ఆనందంగా ఉంటుందని రాష్ట్ర సర్పంచ్ ఫోరం నాయకులు పర్వతగిరి రాజు అన్నారు.బుధవారం ఆత్మకూరు మండల కేం ద్రంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలు చేసిన అనం తరం రాష్ట్ర సర్పంచ్ ఫోరం నాయకులు పర్వతగిరి రాజు అం దరికి ఇఫ్తార్ విందును అందించారు. పర్వతగిరి రాజు మాట్లా డుతూ పార్టీలకు అతీతంగా అందరు కలిసి పండుగలను నిర్వ హించుకుంటేనే సంతోష కరంగా ఉంటుందని అన్నారు. ఈ విందులో పాక్స్ చైర్మన్ ఏరుగొండ రవీందర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, ఓబీసీ జిల్లా కోఆర్డినేటర్ చిమ్మని దేవరాజు,నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బయ్య తిరుపతి,జిల్లా నాయకులు తనుగుల సందీప్,అలువాల రవి,బయ్యా కుమా రస్వామి,బారు బరుపట్ల కిరీటి,అయోధ్య, జయపాల్ రెడ్డి, ప్రసాద్, మొహమ్మద్ఖాజా,అంజలి రమేష్,కరీం పాల్గొన్నారు..
గూడెప్పాడ్ లో ఇఫ్తార్ విందు
రంజాన్ పర్వదిన పురస్కరించుకొని గూడెప్పాడ్ మసీదులో అందరితో కలిసి బిఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నా యకులు మొహమ్మద్ బాబు మియా (చిరంజీవి) ప్రార్ధనలు చేసిన అనంతరం అందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నా రు. అందరు కలిసి పండుగలు ఆచరించుకున్నప్పుడే సంతో షంగా ఉంటుందని అన్నారు.