Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అ న్నారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు మరణించిన బిఆర్ ఎస్ కార్యకర్త మచ్చిక సాంబలక్ష్మీ కుటుంబానికి రూ.2 లక్షల పార్టీ ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం జూలై నెలలో ట్రైన్ ప్రమాదం లో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణిం చిన మచ్చిక సాంబలక్ష్మి కుటుంబానికి నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషితో బిఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రమాద బీమా రూ.2 లక్షల మంజూరు చేశారని తెలిపారు. పార్టీప రంగా కార్యకర్తల సంక్షేమ విషయంలో సభ్యత్వం తీసుకున్న వారూ ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ చెల్లించ డంలో బిఆర్ఎస్ పార్టీ భారతదేశంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య,సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ,రైతుబందు జిల్లా కమిటీ సభ్యులు బొప్పిడి పూర్ణచం దర్ రావు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు తక్కలపెళ్లి రమేష్, సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేష్,గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్,వార్డు సభ్యులు జటంగి నాగరాజు, మాజీ ఎంపిటిసి బోడ పూలు నాయక్,నాయకులు గంగాపురం రాజు,మర్రి రామస్వామి,వెంకట నారాయణ,పర్చూరి నరేంద్ర, యార్లగడ్డ గాంధీ తదితరులు పాల్గొన్నారు.