Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండల పరిధిలో వరిధా న్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపె ల్లి దేవేందర్రావు డిమాండ్ చేశా రు. మండల కేంద్రంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలో గత 10రోజుల నుంచి కోతలు మొదలు పెట్టినప్పటికీ ఇప్ప టివరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను ఏదో వైపు మళ్లిస్తూ మోసం చేయడానికి సీఎంకేసీఆర్ ప్రయత్నిస్తున్నా డని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించాలని ఆదేశించి వారం రోజులైనా ఇప్పటివరకు ది క్కులేదని ఎద్దేవా చేశారు.
అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో శ్రద్ధ లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికైనా రైతుల క్షేమం కోసం ఒకటి రెండు రోజులలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు మొక్కజొన్న కొనుగోలు చేయాలని కిసాన్ కాంగ్రెస్ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.