Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
చేనేతలకు లక్ష రూపాయల రుణం మాఫీ చేసి కార్మికులను ఆదుకున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని సూరారంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న చేనేత భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పేదలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం అని తెలిపారు. గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు రూ.37,04,292ల విలువగల కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఎల్కతుర్తి మండలంలో 1524 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.13,76,43,860లు విలువగల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వందమంది యువకులు బీజే పీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారిని ఎమ్మెల్యే సతీష్ కుమార్ సాద రంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, వైస్‌ఎంపీపీ తంగడ నాగేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడిశాల సమ్మయ్య గౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, చైర్మన్ శేషగిరి, ఎంపీ టీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూరుగుల రామారావు, సూరారం సర్పంచ్ కుర్ర సాంబమూర్తి, సర్పంచ్ కొమ్మిడి నిరంజ న్‌రెడ్డి, తహశీల్దార్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో తూర్పా టి సునీత, పలువు రు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.