Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని ఎర్రగట్టుగుట్ట కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం 34వ వార్షిక క్రీడోత్సవ వేడుకలు విజయ వంతం గా ముగిసాయి. ఈ సందర్భంగా క్రీడాపోటీ ల్లో అత్యంత ప్రతిభకనబర్చి విజేతలుగా ని లిచిన క్రీడాకారులకు ఏకలవ్య అవార్డు గ్ర హిత, అంతర్జాతీయ క్రీడాకారిణి పూనమ్ బెల్లియప్ప, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు చేతుల మీదుగా బహుమతులను అందజేసి అభినందించారు. ఈ సంద్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పూనమ్ బెల్లియప్ప, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓట ములు సహజమేనని వాటినిస్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగితేనే జీవితంలో అనుకున్నది సాధించవచ్చ న్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటముల పట్ల సమదృష్టి కలిగి ఉండాలన్నారు. క్రీడలు ఆరోగ్యాన్ని, శారీ రక దృఢత్వాన్ని, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కిట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి మాట్లాడుతూ 2022-2023 విద్యా సంవత్సరంలో 40కి పైగా క్రీడలు, ఆటలు నిర్వహించామన్నారు. విద్యార్థుల్లో విజేతలకు మొత్తం 12 ట్రోఫీలు, 561 పతకాలు, అధ్యాపకులకు వివిధ క్రీడా కార్యక్రమాల విజేతలకు 84పతకాలు ప్రదానం చేసినట్లు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ చదువులోనేకాకుండా క్రీడలు, ఆటల్లో కూడా బెంచ్‌మార్క్‌లు సష్టిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అశోక్‌రెడ్డి, కోశాధికారి పి.నారాయణరెడ్డి, మేనేజ్మెంట్ సభ్యులు ఇ.రాంరెడ్డి, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.