Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
గుడిసె వాసులకు పట్టాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం జీవో 58 ,59 తీసుకొచ్చిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. 36వ డివిజన్ జ్యోతి బాసు నగర్ లో గుడిసె వాసుల పట్టాల కోసం ఉచిత మీసేవ కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ రిజ్వాన షమిమ్ తో కలిసి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేద గుడిసె వాసుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టాలు అందించే కార్యక్రమంలో భాగంగా 58, 59 తెచ్చారని ఈ జీవోలకు అనుసరించి పట్టాల కోసం పేర్లను మీసేవ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని ఈ సేవ పూర్తి ఉచి తంగా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల బాగు కోసం అహర్ని శలు శ్రమిస్తున్నారని గుడిసే వాసులందరికీ పట్టాల పంపిణీ అతి త్వరలో చేయ డం జరుగుతుందని అన్నారు. పేదల ప్రభుత్వముగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుం దని పేదల మనిషిగా తాను గుడిసె వాసుల అభివద్ధికి శాయ శక్తుల కష్టపడతా నని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వెలుపకొండ యాకయ్య బి అర్ ఎస్ డివిజన్ నాయకులు మర్రి శ్రీనివాస్, గడల రమేష్ యాదవ్, శ్యామ్, నరేష్, ఐలయ్య, రమణ, శ్రీను, మోహన్, లావణ్య, జ్యోతి, గుల్బ, మధు, గణేష్, అబ్బు, అనిల్, తదితరులు హాజరయ్యారు.