Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
వడ్డెర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడానికి నేడు హనుమకొండ గోకుల్ నగర్ కల్యాణ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే జిల్లా వడ్డెర్ల మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం వ్యవ స్థాపక అధ్యక్షులు పల్లపు సమ్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ధ్యారంగుల నాగేష్ అన్నా రు. గురువారం కాజీపేట మీడియా పాయింట్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వడ్డెర్ల తరతరాలుగా చెరువులు, కుంటలు, బావులు, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు నిర్మించుటకు నేటికీ సంచార జీవితాలు గడుపుతున్నారు. విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెనుకబడి జీవిస్తున్నారని, స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా వడ్డెరలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని, వడ్డెర్ల అభివద్ధి జరగడం లేదన్నారు. వడ్డెరల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడానికి నేడు హనుమకొండ ఏకశిలా పార్క్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం ఉన్నట్లు, అనంతరం హనుమకొండ గోకుల్ నగర్ కళ్యాణ్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే హనుమకొండ వరంగల్ జిల్లాల మహాసభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొంత ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లపు రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు పల్లపు రాజేందర్, హనుమకొండ నియోజకవర్గ అధ్యక్షులు కస్తూరి రాజు, ప్రచార కార్యదర్శి పల్లపు లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి నవీన్, పల్లపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.