Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మౌత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 23న వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాత సంఘం ఆద్వర్యంలో నిర్వహించనన్న ఉత్సవాలకు విశ్వబ్రాహ్మణ జాతీయులు భారీగ తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాత సంఘం ప్రధాన కా ర్యదర్శి చొల్లేటి కష్ణమాచార్యులు,హనుమకొండ జిల్లా సంఘం అధ్యక్షులు అలుగోజు కష్ణమూర్తి,వరంగల్ జిల్లా సంఘం అధ్యక్షులు బండ్లోజు నరిసింహా చారి కోరారు.గురువారం బ్రహ్మౌత్సవాల పోస్టర్,కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన కళల కాణాచి ఓరుగల్లు నగరంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగుతున్న సుప్రసిద్ధ శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వ కర్మ మాత సంఘం ఆద్వర్యంలో అందరి సహకారంతో ఉత్సవాలను విజయ వంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
బ్రహ్మౌత్సవాలకు ముఖ్యఅతిధిగా ఎంఎల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరవుతారని తెలిపారు.గౌరవ అతిధులుగా జూలూరి గౌరీశంకర్,చిట్టనోజు ఉ పేందర్, తల్లోజు ఆచారి,దాసోజు శ్రవణ్,లాలుకోట వెంకటాచారి,వేములవాడ మదన్మోహన్ తదితర విశ్వబ్రాహ్మణ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి పలు కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. విశ్వబ్రాహ్మణ జాతీయులు కుటుంబ సమేతంగా హాజరై భద్రకాళీ అమ్మవారి కపకు పాత్రులు కాగలరని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా సంఘాల నాయకులు వీణవంక సదానందం,శ్రీరామోజు నాగ సోమేశ్వరా చారి,డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్,పెందోట చక్రపాణి,పెందోట సురేష్ కుమార్,గజ్జెల వీరన్న,గజ్జెల చక్ర పాణి, శ్రీ రామోజు నాగారాజా చారి,శ్రీ రామోజు వెంకటేశ్వర్లు,మహేశ్వరం బిక్షప తి, మండలోజు జగన్,మహారాజ భరత్, బ్రహ్మశ్రీ కొక్కొండ రాజేంద్ర ప్రసాద్, మునిగంటి రామన్న,అడ్లూరి మల్లిఖార్జున్,వీణవంక రాజేశ్వర్,బొల్లోజు బ్రహ్మం, కత్రోజు లింగాచారి,మహిళా సంఘం నాయకులుగుగ్గిళ్ళ శశిరేఖ,చెంగెళ్ళి హేమలత, కర్ణకంటి భారతి తదితరులు పాల్గొన్నారు.