Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
నిత్యావసర సరుకుల ధరలుపెంచుతూ పేద, మధ్యతరగతి ప్ర జల జీవితాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్భరం చేస్తుందనీ సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. శివనగర్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఇంటింటికి సిపిఐ అని గోడప త్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కా ర్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మరో వైపు కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల ప్రజాధనాన్ని కార్పొ రేట్ కంపెనీలకు అప్పనంగా దోచిపెడుతు న్నద ని రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేయలేని కేంద్ర ప్ర భుత్వం కార్పొరోట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపా యలు రుణమాఫీ చేస్తున్నదని విమర్శించారు. పెరు గుతున్న నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బనం తగ్గిం చకుండా మతరాజకీయాలు చేస్తూ యువతను పక్క దారి పట్టిస్తూ మోడీ అధికారం అనుభవిస్తున్నా డన్నా రు. దేశంలో ఉన్న అన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థల ను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ మాత్రం మిగిలిన ఉన్న న్యాయవ్యవస్థను కూడా శాపించటానికి ప్రయ త్నాలు ముమ్మరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రమాదంలోకి నె డుతున్న బీజేపీ దాని అనుకూల శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికే ఈ కార్యక్రమం అని చెప్పారు. బీజేపీ హఠావో- దేశ్ బచావో..నినాదంతో సీపీఐ జా తీయ సమితి పిలుపుమేరకు ఇంటింటికి సీపీఐ కార్య క్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా సహాయ కార్యదర్శులు భాష్మియా జిల్లా కార్యవర్గ సభ్యులు గన్నారపు రమేష్ చెన్నకేశవులు శరత్ గోవర్ధనచారి ఉప్పుల రవి యాకోబ్ యోగానంద చారి విక్టోరియా సుమలత యాకయ్య తదితరులు పాల్గొన్నారు.