Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
రెండో విడత గొర్రెల పంపిణీలో అవినీతి తావు లేకుండా నగదు బదిలీ చే యాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్‌ను కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు చల్ల మల్లయ్య, జిల్లా కార్యదర్శి పరికి మధుకర్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల అభివద్ధి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిందని రెండు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి మొదటి విడత పూర్తయి, రెండో విడత కోసం ఇప్పటికే గొల్లకురుమలు డీడీలు కట్టారన్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో అనేక లోపల జరిగాయని వాటిని అధిగమించాలంటే నగదుబదిలే ఏకైక మార్గం అని వివరించారు. జిల్లాలో రెండో విడత లో 12,782 మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేయాల్సి ఉందని వివరించారు. గొర్రెల పంపిణీ ప్రారంభానికి ముందు ఏ లిస్టు, బి లిస్టు డ్రా చేసినప్పుడు కొంత వెటర్నరీ డాక్టర్ల లోపాల వల్ల కొంతమంది లబ్ధిదారులు పేర్లు తొలగించారని గతంలో లిస్టులో లేని వారి పేరుతో పాటు, ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి గొర్రెల పంపిణీ చేసేలా చూడాలని కోరారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడు తూ గొల్లకురుమలకు దళిత బంధు మాదిరిగా గొర్రెల పంపిణీ చేసేలా మంత్రి కేటీఆర్ తో మాట్లాడి గొల్లకురుమలకు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చా రు. విలీన గ్రామాల గొల్లకురుమల కూడా గొర్రెల పంపిణీ చేయడం కోసం త్వర లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 12వ డివి జన్ కార్పొరేటర్ కావటి కవిత-రాజుయా దవ్,జిల్లా ఉపాధ్యక్షులు గడ్డి రవి, కావ టి సారయ్య, పెద్దకాసు దిలీప్, మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.