Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
తెలంగాణ రైతులు యాసంగిలో పండించే మొ త్తం ధాన్యాన్ని ప్రతిగింజ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటదని,రైతాంగానికి సీఎం కెసిఆర్ భరోసా ఇచ్చా రని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య అన్నారు. మండలంలోని నమిలిగొండ, తాటి కొండ గ్రామంలో సేర్ఫ్, డీఆర్డీఏ, ఐకేపీ మహిళా సం ఘాలైన శ్రీరామ,శ్రీలక్ష్మి, శ్రీసాయి ఆధ్వర్యంలో గురు వారం యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీ ఎం కవిత, రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని డా క్టర్ ప్రణీత ఆధ్వర్యంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చై ర్మన్ మారపాక రవితో కలిసిప్రారంభించారు.ఈ సం దర్భంగా సర్పంచ్ డ్యాగల ఉప్పలస్వామి, చల్లా ఉమా దేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఏగ్రేడ్ వరి రకానికి రూ.2060, సాధారణ వరి రకానికి రూ. 2040 కొనుగోలు చేస్తానని తెలి పారు. ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పా టు చేసి, రైతులు పండించిన ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిపారు. మద్దతు ధరకే కొనుగో లు కొంటదని, రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెంది తక్కువ ధరకు దళారులకు ధాన్యం అమ్ముకోవ ద్దని భరోసా ఇచ్చారు. ధాన్యం రవాణా ఇబ్బందులు తలెత్తకుండా విశ్వనాథపూర్ మీదుగా వెళ్లేందుకు బీటీ రోడ్డు నిమిత్తం రూ. 5లక్షలు, ఐకేపీ మహిళా సమా ఖ్యకు రూ. 5లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం లో ఏ ఒక్కరు కంటిచూపు సమస్యలతో బాధపడకూ డదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, ఆరోగ్య తెలంగాణలో భాగంగా కంటి వెలుగును తెచ్చినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపిపి చల్లా సుధీర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుజ్జరిరాజు, వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, సర్పంచ్ సురేష్ కుమార్, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఉప సర్పంచ్ చందు, ఏఓ చంద్రన్ కుమార్, మండల ప్రచార కార్యదర్శి మోటం ప్రభా కర్, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ పురుమాని ఐలోని, గ్రామ శాఖ అధ్యక్షుడు కోల హరిక్రిష్ణ, పంచాయితీ కార్యదర్శి జిల్లేల శేఖర్, ఐకేపీ మహిళా సంఘాల నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ
లింగాలఘనపురం : ఈ యాసంగిలో పండిం చిన ధాన్యాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతు ల వద్ద నుండి కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సిఎం కెసిఆర్ భరోసా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. గురువారం మండలం కళ్లెం గ్రామంలో కళ్లెం పిఏసిఎస్ ఆధ్వ ర్యంలో నిర్వహించే యాసంగి ధ్యానం కొనుగోలు కేం ద్రాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 33 మంది లబ్ధిదారులకు రూ. 33,03,828 రూపాయల విలువైనకళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య లబ్ధి దారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దా న్యం తీసుకువచ్చే ముందరనే రైతులుమంచిగా ఆర బెట్టుకొని తేమశాతం 17 శాతం ఉండే విధంగా చూ సుకొని తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎండాకాలం ఉంది కావున కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ నీడ కోసం డేరాలు కూడా ఏర్పాటుచేయాలని అధికారులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీ ధర్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ ఉపేందర్, తహశీల్దార్ అంజయ్య, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాగేందర్, శ్రీవా రి, విష్ణు, రవి, ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, సంబంధిత శాఖల అధికారులు, రైతు లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.