Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా డిమాండ్
నవతెలంగాణ-బయ్యారం
అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం ఎల్) ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో స్థాని క తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చడం జరిగింది. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ప్రదర్శనగా తాహసిల్దార్ కార్యాలయం కు వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించి తహసిల్దార్‌కు వినతి పత్రం ఇవ్వడం జరి గింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ మహబూ బాబాద్ డివిజన్ కార్యదర్శి జగ్గన్న, బయ్యారం సం యుక్త మండల కార్యదర్శి బిల్లా కంటి సూర్యం మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇస్తామని ప్రక టించగా ఆ ఇండ్ల కోసం లక్షలాది మంది ప్రజలు ఎ దురు చూస్తుంటే కేసీఆర్ మాత్రం వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేసి పేదల ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. దీంతో సొంత ఇంటి కల కలగానే మిగిలే పరిస్థితి ఉందన్నారు. సొంత జాగా ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు, కేంద్రం ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.సొంత జాగా లేని పేదలకు ప్రభుత్వం వారికి జాగాలను కేటాయిం చి వారికి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలన్నారు. అలానే గత ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డు కలిగిన పేదలం దరికీ తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఉచితం గా అందజేస్తే కేసీఆర్ ముక్కీ, మూలిగిన బియ్యం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలందరికీ 12 రకాల నిత్యవసర సరుకులు 10 కేజీల సన్న బియ్యం ప్రభు త్వం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేయా లన్నారు. అలానే వృద్ద, వితంతు, వికలాంగులు, ఒం టరి మహిళలకు పెన్షన్ వెంటనే మంజూరు చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉమ్మగాని సత్యం, నూతక్కి మధుసూద న్ రావు, పూజల లచ్చయ్య, కస్తాల శ్రీను, నాయకులు కొలిపాక రవి, బత్తుల ధనంజయ, గుర్రం పూర్ణచం ద్రారెడ్డి, ముత్యాల భద్రయ్య, జానీ,శ్రీను పాల్గొన్నారు.
కొత్తగూడ : అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ (ఎం ఎల్) ప్రజాపంథా కొత్తవాడ గంగారం మండలాల సహాయ కార్యదర్శి ల్యాదల్ల రాజు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్ర భుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ గురువారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యా లయంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కంటి తుడుపు చర్యగా అక్కడక్కడ ఇండ్ల నిర్మాణం చేసి అవి పేదలకు అప్పజెప్పకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి మూ డు లక్షలు ఇస్తామని హామీ ప్రకటనలు తప్ప నిర్దిష్ట విధివిధానాలను ప్రకటించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అవకాశవాదాన్ని అర్థం చేసుకోవాలని ప్రజలను కో రారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షలు సరి పోవని ఐదు లక్షలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం మరో ఐదు లక్షలు కేటాయించి అర్హులకు పక్కా ఇళ్ళు ఇవ్వా లని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 24న జిల్లా కేంద్రంలో జరుగు ఆందోళన కార్యక్రమంలో ఇల్లు లేని పేదలం తా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కంగాల పాపయ్య, సునీల్, రాజు, ప్ర సాద్, లక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లుతక్షణమే ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నెల్లికుదురు, నరసింహులపేట, చిన్న గూడూరు మండలాల సంయుక్త కార్యదర్శి ఇరుగనిల్ అన్నారు. గురువారం నెల్లికుదురు తహసిల్దార్ కా ర్యాలయం ముందు ఇల్లు లేని నిరుపేదలతో నిరసన తెలిపి అనంతరం తహసిల్దార్ యోగేశ్వర రావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కావాలని లక్షల మంది దరఖాస్తులు చేసుకొని సంవత్సరాలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం పట్టచ్చుకోవటంలేదన్నారు. మాటలతో కా కుండా చేతల్లో నిరూపించకపోతే ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభు త్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 24న జిల్లా కేంద్రంలో జరుగు ఆందోళన కార్యక్రమంలో ఇల్లు లేని పేదలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి, వెంకటయ్య ప్ర శాంత్, మల్లయ్య, స్టాలిన్, తదితరులు పాల్గొన్నారు
పెద్దవంగర : అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం స్థలం ఉన్న పేదలకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని సీపీఐ (ఎంఎల్) ప్రజా పంథా సబ్ డివిజన్ కార్యదర్శి చింత నవీన్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం తహసీల్దార్ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా 10 లక్షలు అందిం చాలన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ అర్హులైన వాళ్లందరికీ డబల్ బెడ్ రూములు ఇల్లు ఇస్తామని, దళితులకు 3ఎకరాల భూమి ఇస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కొక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో సబ్ డివిజన్ నాయకులు పూల్‌సింగ్, మల్లేష్, యాదగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.