Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య గురువారం మండలంలో పర్యటించి పలు కార్యక్ర మాల్లో పాల్గొన్నారు.మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏ ల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపా రు. వీఓఏలకు ఉద్యోగ భద్రతతో పాటు భీమా సౌక ర్యం కల్పించి వారి న్యాయపరమైన డిమాండ్లను ప్ర భుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు. మండల కేంద్రానికి చెందిన పొంగులేటి, కోరం వర్గీయుల యువ నాయకుడు తునికిపాటి క్రాంతి-భవానిలకు ఇటీవల కుమార్తె జన్మించగా వారి స్వగహానికి వెళ్ళి చిన్నారిని ఆశీర్వదించారు. మండలంలోని మిర్యాల పెంట గ్రామపంచాయతీ పరిధిలో ప్రారంభం కాను న్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా కారులను పరిచయం చేసుకున్న అనంతరం మొదటగా తలపడనున్న సాం బతండా-పందెం జట్ల మధ్య రసవత్తరంగా సాగు తున్న పోరును ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. ఈ కార్యాక్రమంలో సర్పంచులు పోలేబోయిన వెంకటేశ్వ ర్లు, గలిగె వెంకన్న, పూసం రమేష్, చింత రమణ, ఎంపీటీసీలు సనప సోమేష్, నాయకులు రాము, పూ నెం సురేందర్, రాసమళ్ళ నాగేశ్వరరావు, పెద్ధినేని వెంకటేశ్వరరావు, నంధగిరి భద్రయ్య, సంకు సత్తిరెడ్డి, వున్నం రామారావు, సుమన్, బోగ్గారపు నాగేశ్వర రావు, పగడాల శ్రీను, తొట్టి అశోక్, సీహెచ్.వెంకన్న, రాందాస్, క్రాంతి, మడుగు సాంబమూర్తి,తాటి బిక్షం, నాగార్జున, ఆముదాల ప్రసాద్, రావూరి సతీష్, ప్రస న్న కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గార్ల : గత నాలుగు రోజులుగా ఐకేపి వివోఏలు సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె చేస్తున్న ప్ర భుత్వం స్పందించకపోవడం ప్రభుత్వానికి వివోఏల పై ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ మండిపడ్డా రు. వివోఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ ఐకెపి ఉద్యో గుల సంఘం(సీఐటీయూ) అధ్వర్యంలో స్దానిక నెహ్రూ సెంటర్లో చేపట్టిన నిరవధిక దీక్ష గురువా రం నాల్గవ రోజుకు చేరుకున్న సందర్భంగా సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. చాలీచాలని వేతనా లతో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్న వివోఏలు ప్రభుత్వం ఎప్పటికైనా జీతాలు పెంచుతుందనే నమ్మకంతో విధులు నిర్వహిస్తున్నార ని అన్నారు.తెలంగాణ వస్తే పోరాటాలు చేయకుండా నే వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరిస్తామని పదే పదే చెప్పిన సియం కేసీఆర్ గత కొన్ని రోజులు వ్యయ,ప్రయాసలతో నిరవధిక సమ్మె చేస్తున్న మహి ళలైన వివోఏల సమస్యలు సియం కేసీఆర్కు పట్టా వా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర స్దాయిలో అమలు చేయడంలో తమ వంతు పా త్ర పోషిస్తున్న వివోఏల సమస్యలు పరిష్కరించేంత వరకు వారి పోరాటాలకు అండగా ఉంటామని తెలి పారు. వివోఏల సమ్మెకు టివివి రాష్ట్ర కార్యదర్శి జం పాల విశ్వ, టిటిఎఫ్ రాష్ట్ర నాయకులు యం.శివ, వివిధ ఉపాధ్యాయసంఘాల నాయకులు యం.రామ చంద్రు, వీరు, ఐద్వా నాయకులు ఎ.సత్యవతి, ఉమా తదితరులు సంఘిబావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఎపియం సత్యనారాయణ, సిసిలు ధనలక్ష్మీ, లక్పతి, కోటేశ్వరి, భాగ్యమ్మలు దీక్ష శిబిరానికి వెళ్ళి పరామ ర్శించారు. దీక్షలో పాల్గొన్న వారిలో వివోఏల సం ఘం రాష్ట్ర, మండల నాయకులు కందుల శోభ, మం డల అధ్యక్ష,కార్యదర్శులు, బోళ్ళ ఉమా, మోడెం వినో ద, అనిత, కల్పన, సరిత, శ్రీజ, సునీత, లక్ష్మి, సరోజ, రజిని, స్వప్న, శారద, జ్యోతి, వీరలక్ష్మి, మనోహర్, మాంగ్యా, రమేష్, వెంకటేష్, సైదులు, రామ, అరుణ తదితరులు ఉన్నారు.
గూడూరు:అర్హులైన విఓఏలను సిఏలుగా నియ మించాలని కోరుతూ మండలంలో విఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాలుగవ రోజుకు చేరు కుంది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు దారం శ్రీలత, కోశాధికారి మల్లె పోయిన శ్రీలత, 65 మంది విఓఏలు, క్లస్టర్బాధ్యులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : వివోఎల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య, ఎమ్మార్పీఎస్ మం డలాధ్యక్షుడు తుళ్ల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో వివోఎల సమ్మె నాల్గవ రోజుకు చేరుకుంది. గురువారం సంఘీ భావం తెలి పి మాట్లాడుతూ కొన్ని ఏళ్ల నుండి వీరు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని, గ్రామాలలో మహిళ సంఘాల సంబంధించిన గ్రూపుల రికార్డులు రాస్తూ వారికి తగిన లోన్లు ఇప్పిస్తూ నుండి బకాయి గా ఉన్న వారిచే రికవరీ చేస్తూ అవగా హన కల్పిస్తూ ప్రభుత్వం కల్పించిన ప్రతి పథకాన్ని గడప గడపకు చేరవేసేదే వివోఏలని వారికి సమాన పనికి సమాన వేతనం అంది ఇవ్వాలన్నారు. వెంటనే వీరిని సెర్ఫ్ ఉద్యోగులుగా నియమిస్తూ అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, బీమా సౌకర్యం కల్పించి వీరి కుటుంబం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివోఏలు బిరు యాకయ్య గుగులోతు హనుమంతు, నసిహతు బేగం, శ్వేత, మంజుల, స్వప్న, హైమా, సరిత, విజయలక్ష్మి, ఉష, ఉపేందర్, అశోక్ వివిధ గ్రామాల వివోఏలు పాల్గొన్నారు.