Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
అకాల వర్షానికి పంటలు కోల్పోయిన రైతాంగాన్నీ ఆర్ధికంగా ఆదుకునేందుకె పంట నష్ట పరిహరం అందిస్తున్నామని మండల రైతు కో ఆర్డినేటర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎన్కతాళ్ళ రవీందర్ అన్నారు. గురువారం ఆత్మకూరు మం డలం పెద్దాపురం గ్రామంలో గత సంవత్సరం పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను మండల రైతు కో ఆర్డినేటర్ ఎన్కతాళ్ళ రవీందర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక,వ్యవసాయ అధికారి యాదగిరి,బిఆర్ఎస్ రాయరాకుల రవీందర్లు చెక్కులను రైతులకు అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ సంక్షేమంకు కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. అ కాలవర్షాలకు ఆర్ధికంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలిచేం దుకు చెక్కులను అందించి భరోసా కల్పిస్తుందని అన్నారు. రైతులు ప్రభుత్వం కలిపిస్తున్న పథకాలు,అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బొల్లబోయిన రాధా రావియాదవ్,పెద్దాపూర్ సొసైటీ చైర్మన్ అంబటి రాజా స్వామి ఏఈఓ చికీత,బిఆర్ఎస్ మండల నాయకులు ఎలుకటి రవి, సంజీవయ్య,జిల్లెల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.
రైతాంగానికి చేయూతనివ్వడమే మా లక్ష్యం : ఎంపీపీ
రైతాంగానికి చేయుతనివ్వడమే మా ప్రభుత్వం ద్యేయంగా పెట్టుకొని పని పని చేస్తుందని ఎంపీపీ మార్క సుమలత అన్నారు. గురువారం ఆత్మకూరు మండలం నీరుకుల్ల రైతు వేదికలో పంట నష్ట పరిహారం చెక్కులను ఎంపీపీ మార్క సుమలత స్థానిక సర్పంచ్ ఆర్షం బలరాం సొసైటీ వైస్ చైర్మన్ పోతరాజు రాజు, ఆత్మకూరు మార్కెట్ డైరెక్టర్ కాకాని శ్రీధర్ అందచేశారు.
-ఆత్మకూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి,సాగర్ రైతులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతు గత సంవత్సరం వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు చెక్కులను అందించి చేయూతనిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి యాదగిరి, ఏఈఓ మానస,ఆత్మకూరు లో ఉపసర్పంచ్ వంగల స్వాతి,ఏఈఓ సౌమ్య , చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో రైతు కో ఆర్డినేటర్ ఆండ్రు విశ్వేశ్వర్ రెడ్డి, సాగర్, తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు..
మండలంలో 544 మంది రైతులకు నష్టపరిహారం చెక్కులు
పెద్దాపురం క్లస్టర్ లో అగ్రంపహాడ్ కు 37 మంది రైతులకు రూ 96662, చౌళ్లపల్లి 59 మందికి రూ.199992, పెద్దాపురం 66 మంది రూ 254989, ఆత్మకూరు క్లస్టర్లో 52 మంది రైతులకు రూ.175826, బ్రాహ్మణపల్లి 16 మంది రైతులకు రూ.49581, కామారం 19 మంది రైతులకు రూ.60414లు, కొట్టగట్టు 8 మంది రైతులకు రూ.23749,మల్కపేట 24 మంది రైతులకు 79913, నీరుకుల్ల క్లస్టర్ 154 మంది రైతులకు రూ.544666,పెంచికల్పేట్ 109 మంది రైతులకు రూ.369289, కటాక్షపూర్ 1 రైతుకు రూ.3608లు చెక్కులను రైతులకు అందచేశారు.