Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
భారత దేశంలోనే కాజీపేట రైల్వే డీజిల్ లోకోషె డ్కు నైపుణ్యంలో ప్రత్యేక గుర్తింపు కలదని దక్షిణ మ ధ్య రైల్వేజనరల్ మేనజర్ ఏకేజైన్ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని డీజిల్ లోకో షెడ్ స్వర్ణోత్సవ వేడుకలను గురువారం నిర్వహించగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనజర్ ఏకెజైన్ ముఖ్య అతిథిగా విచ్చే శారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీపేట కు విచ్చేసిన ఆయనతో పాటుగా వివిధ హెచ్డి రైల్వే అధికారులకు స్టేషన్ మాష్టర్ సత్యనారాయణ రెడ్డి, సీనియర్ డీఎంఈ సందీప్ కుమార్‌లు పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికారు. ఆయనతో పాటుగా పలువురు రైల్వే ఉన్నతాధికారులు రోడ్డు మార్గంలో చింతలపల్లి రైల్వే స్టేషన్, హసన్‌పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల వరకు వెళ్లి తనిఖీ చేసి తిరిగి వచ్చారు. అనంతరం డీజిల్లోకో షేడ్‌కు చేరుకోవడంతో ఆయనకు మహిళ కార్మికులు కోలాటాలతో స్వాగతం పలికారు. డిజీల్ లోకోషెడ్‌లో ఇటీవల సామర్ధ్యం పెంచిన షెడ్‌ను ప్రా రంభించారు. షెడ్లోకలియ తిరిగి ప్రతి అంశాన్ని క్షు ణంగా పరిశీలించారు. షెడ్లో అయిల్ కంపెనీలు ఏ ర్పాటు చేసిన టూల్స్, భారత రైల్వే పుట్టినప్పడి నుం చి వాడిన రైలింజన్లు, వివిధ దేశాలకు చెందిన నాణా లు, కరెన్నీనోట్ల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. రైల్వే అదికారులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. అ నంతరం డీజిల్ కాలనీ రైల్వే కమ్యూనిటీ హాల్లో సీని యర్ డీఎంఈ సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో షెడ్ స్థా పించినప్పటి నుంచి షెడ్ అభివృద్ధికి పాటుపడిన అ ధికారులు, రైల్వే కార్మికు లను శాలువలతో సన్మానిం చి, మెమోంటో లను అంద చేశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం మాట్లాడుతూ డీజిల్ లోకో షెడ్ 50 వ వార్షికోత్సవాన్ని జరుపు కోవడం అభినంద నీయమ న్నారు. డీజిల్ లోకో షెడ్ 21 ఏప్రిల్ 1978లో 38 లోకోలతో ప్రారంభమైన షెడ్ దినదినాభివద్ధి చెంది కార్మికుల పని నైపుణ్యంలో దక్షిణ మధ్య రైల్వేలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. షెడ్లోని కార్మికులు, అధికారుల సమన్వయంతోనే పలు ఐఎస్ఓ సర్టిఫికేట్లు పొందడం జరిగిందన్నారు.
డీజిల్ లోకోషెడ్‌లోని కార్మికులు డీఎల్ఎస్, ఈఎ ల్‌ఎస్ రైలింజన్లు నిర్వాహణ చేపట్టడం జరుగుతుం దన్నారు. త్వరలోనే డీజిల్ షెడ్ పూర్తి స్థాయిలో ఈ ఎల్ఎస్ షెడ్‌గా మారబోతుందన్నారు. షెడ్ కార్మికుల కు ఎలాంటి టార్గెట్ ఇచ్చిన పూర్తి చేయకలిగే నైపు ణ్యం ఉందన్నారు. ఎగ్జిబిషన్ లో వివిధ రకాల టూ ల్స్‌ను తిలకించామని ఆ టూల్స్ శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానంతో కొంత మంది కార్మికులు చేసే పనిని ఒక్క టూల్స్ చేస్తుందన్నారు. షెడ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా షెడ్ పక్షాన 50 వేల నగదు బహుమతిని ఆయన ప్రకటించారు. షెడ్ కార్మికుల ఆరోగ్య దష్ట్యా పూర్తి స్థాయిలో హెల్త్ యూనిట్‌ను ప్రకటించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలను ఆయన, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి తలకించి, పలువురికి బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా, పీసీఈఈ పీడీ మిశ్రా, పీ సీఓఎం నాగ్య, సీఎల్ తార్య, , సీఎంపీ ధర్మేంధ్ర, సీనియర్ డీఈఈ (ఓ) నవీస్, పీనియర్ డీఎస్టి వెంకట్రాజం, సీనియర్ డీఈఈ అనంత కష్ణ సాయి, సీనియర్ టీఆర్డీ వాషింగ్ పాషా, డీఎంఈ హనుమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.