Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం
- హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
గ్రామాల అభివద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని,విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురు వారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కంలో భాగంగా చేపట్టే పనులు, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం, గ్రామ స్థాయి లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం అదనపు కలెక్టర్ సంధ్యా రాణితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభు త్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక నిధులు, పథకాలు ప్రవేశపె డుతుందని గ్రామస్థాయిలో ఉన్న ప్రతి ఉద్యోగి పౌరులకు ఆ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు పనిచేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా చేపట్టే పనులలో కూలీల సంఖ్య పెంచి లేబర్ టర్నోవర్ నమోదు చేయాలని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో చేపట్టే వాటర్ మేనేజ్మెం ట్ సిస్టంపై అవగాహన కల్పించి , ఇంకుడు గుంతలు, సెప్టిక్ ట్యాంక్ నిర్వహణ పై ప్రజలకు తెలియపరచాలన్నారు. గ్రామస్థాయిలో వైకుంఠధామాలు నిర్వహణ అందులో విద్యుత్ కనెక్షన్ వాటర్ సౌకర్యం కల్పించి వైకుంఠధామం చుట్టూ బయో ఫినిషింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
బృహత్పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రకతి వనాల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలు, సంబంధిత సిబ్బంది చూడాలని సూచించారు. మల్టీ లేయర్ ఏవే న్యూ ప్లాంటేషన్, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, నర్సరీలు, సెక్రిగేషన్ షెడ్, హరిత హారం ప్లాంటేషన్,తదితర గ్రామస్థాయిలో నిర్వహించే పనులను 100 శాతం లక్ష్యం చేరుకుని జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచేందుకు అందరూ కలి సి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన అభివద్ధి పనులను వెంటవెంటనే నిర్వహిస్తూ గ్రామస్థాయి యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేసు కుని అందుకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ ప్రా జెక్ట్ డైరెక్టర్ ఏ.శ్రీనివాస్ కుమార్, జెడ్పీ సీఈవో సురభి వెంకటేశ్వరరావు, డిపీఓ జగదీశ్, జిల్లాలోని మండల పరిషత్ అభివద్ది అధికారులు, మండల పాంచాయితి అధికారులు,ఎపి ఓలు, సంబంధిత శాఖల సిబ్బంది ఉన్నారు.