Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబంధు సమితి చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ గులాబీ జెం డాను ఎగురవేసి తీరుతామని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశా రు. గురువారం నగరంలోని బీఆర్ఎస్ 4,5,6,8 వ డివిజన్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలు ఏవిధంగా అందుకున్నాయో తెలుసుకోవడానికి కేసీఆర్ పంపిస్తే ఇక్కడకు వచ్చాన న్నారు. 2014కు ముందు, నేటి పరిస్థితి ఏంటి ఒక సారి ఆలోచనచేయాలన్నారు. దాస్యం వినయభాÛస్క ర్ 15ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నో అభివద్ధి ప నులు చేపట్టారని కొనియాడారు. పేపర్ లీకులు చేసి నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని బీజే పీపై విరుచుకుపడ్డారు. మీ కార్పొరేటర్ మీ ఎమ్మెల్యే మీ దగ్గరికి వస్తుంటే మంచి పనులు చేస్తుంటే ప్రతిప క్షాలకు కళ్లుమండుతున్నాయన్నారు. ఎన్నికలు రాగా నే తోడేళ్లు వస్తున్నాయని వాటిని తరిమికుంటే బాధ్య త ప్రతిఒక్క కార్యకర్తపై ఉందని హనుమకొండ జిల్లా లో గులాబీ జెండా ఎగరాలన్నారు. కార్యక్రమం అనం తరం రూ.34,03,944లు విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడం జరిగింది.
ఎమ్మెల్యే వినరు భా స్కర్ మాట్లాడుతూ గత 30ఏళ్లుగా పరిస్థితులు ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నా రు. కేసీఆర్ 2009లో ఆశీర్వదించి పంపిస్తే పశ్చి మ నియోజకవర్గం గెలి పించారని తమ్ముడుగా మీకు అన్ని విధాలాసహకారం అందిస్తానన్నారు. కేసీ ఆర్ సీఎం అయ్యాక కళ్యాణలక్ష్మి, షాది ముబారక్లాం టి పథకాలలో తీసుకురావడం జరిగింది. అదేవి ధంగా కేసీఆర్ నాయకత్వంలో పశ్చిమ నియోజకవ ర్గంలో రోడ్లు డ్రైనేజీలు పలు రకాల అభివృద్ధి పనులు చేసుకున్నామని అన్నారు.
నన్ను గెలిపించినందుకు నా వంతు సహకారం పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలాకాపా డుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా బీజే పీ, కాంగ్రెస్ నాయకులు మభ్య పెట్టి వారి పార్టీ లోకి లాగేందుకు చూస్తారని అలాంటి వారిని ప్రశ్నించి వా రుపాలించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సం క్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించండి అ న్నారు. గతంలో వర్షాకాల సమయంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో మీవెంట ఉండి అన్ని విధాలా సేవ కార్యకమాలు చేపట్టనని, ఆ సమయంలో ఏ పార్టీ అయినా ముందుకు వచ్చిందా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుడా చెర్మన్ సంఘం రెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, మాజీ మేయర్ గుండా ప్రకా ష్, కార్పొరేటర్లు చెన్నం మధు, బొంగు అశోక్ యాద వ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాటిచెట్టి విద్యా సాగర్, తాళ్లపెళ్లి జనార్దన్‌గౌడ్,మాజీ కార్పొరేటర్ వీర గంటి రవీందర్, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిష న్ సభ్యుడు దర్శన్‌సింగ్, బిఆర్ఎస్ నాయకులు నలబో లు సతీష్, డివిజన్అధ్యక్షులు బిఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.