Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటీ మొత్తం కూడా అవినీతిమయంగా మారిందని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. గురు వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం అవినీతిమయం అయిందని, అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టడమే నిదర్శనమని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివద్ధి పనులు జరిగినా, మొత్తం కూడా చైర్మన్ వెంకట రాణి, వైస్ చైర్మన్ హరిబాబు ల దక్కేలా చూస్తు న్నారని, ప్రోటోకాల్ పాటించడం లేదని 20 మంది బిఆర్ ఎస్ కౌన్సిలర్లు ఆరోపించినట్లు గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ కేటాయింపులో కౌన్సిలర్ల తీర్మానం లేకుండానే చైర్మన్ వెంకటరాణి, వైస్ చై ర్మన్లకు, వారి అనుచరులకే కేటాయింపులు చేయ డం సిగ్గు చేటన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడు తుందని గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, ముఖ్య నాయకులు అంబాల శ్రీనివాస్, గణపురం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, నాయకులు పిప్పాల రాజేందర్, నాను, రవి, శ్రీనివాస్, రంజిత్, రజినీకాంత్, విజరు, పథ్వీ, వెంకన్న, అనిల్, సాగర్, బాపురావు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే ముస్లింల అభివద్ధి
టేకుమట్ల : కాంగ్రెస్తోటే రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనా రాయణరావు అన్నారు. గురువారం మండలంలోని ముస్లిం సోదరులందరికీ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. సత్యనారాయణ రావు హాజరై ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అనంతరం స్థానిక మసీదులో ముస్లిం సోదరులతో నమాజ్ ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన బీఆర్ఎస్ 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ముస్లిం మైనార్టీలను మోసం చేయడం జరిగిందన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ముస్లిం లందరికీ రుణాలను అందించి ఆర్థికంగా అభివృద్ధి చేయడం జరు గుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొందరు మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వై నాల రవీందర్, ఎండి అన్వర్, యశ్వంత్, సంపత్,దయాకర్, రమేష్ దాసరపు సదానందం, ఆడెపు సంపత్, ముస్లిం సోదరులు ఎస్కే గని, సర్వర్, రఫీ,రంజాన్, మదర్ సాబ్, షరీఫుద్దీన్,రహీం పాషా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.