Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్
- వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో సంతకాల సేకరణ
నవతెలంగాణ-హనుమకొండ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్( టిడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ జిల్లా అధ్యక్షులు టీవీ.రాజుగౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దయాసాగర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులు ఇండ్లు లేక, అద్దె భవనాల్లో ఉంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టివి.రాజుగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ సూచన మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం దశలవారిగా ఉద్యమ కార్యచరణ రూపొందించామని ఈనెల 25,26 తేదీల్లో నియోజకవర్గాల వారీగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇవ్వాలని మే 2,3 తేదీల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్, 'నవతెలంగాణ' మేనేజర్ దేవేందర్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు సురేందర్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, కోశాధికారి తిలక్‌బాబు, ఈసీ మెంబర్ మంద రాజేష్, వెంకటేష్, రాజేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.