Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాద్
పేదల కష్టం తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మహబూబాబాద్‌లో ఆర్తి గార్డెన్స్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సత్యవతి మాట్లాడారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. సొంత జాగా ఉన్న ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ త్వరలో రూ.3,00,000 కేటాయించనున్నట్లు తెలిపారు. మనుకోటను నలువైపులా అభివృద్ధి చేసుకున్నాం అని, ఇంకో పార్టీ పోటీ చేయాలంటే భయపడే విధంగా ఉండాలని అన్నారు. ఈ ప్రాంతంలో ఇతర పార్టీలకు డిపాజిట్ దక్కే అవకాశం లేదు అని అన్నారు. జిల్లా పరిధిలోని ఒక్కోగురుకులం అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని అన్నారు. 75 ఏండ్లలో జరుగని అభివృద్ధి తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు యావత్ దేవానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాదయాత్రల పేరుతో గ్రామాలు తిరిగినా ప్రయోజనం లేదన్నారు. గిరిజన రిజర్వేషన్ 6 నుండి 10శాతం పెంచిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి, ఒక్కో నూతన గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల చొప్పున ఇచ్చారు అని అన్నారు. ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేద ల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ ఫరీద్, స్థానిక కౌన్సిలర్లు, మార్నేని వెంకన్న, రఘు, కిరణ్ పాల్గొన్నారు.