Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొర్రూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి తిరుపతి
నవతెలంగాణ-నెల్లికుదురు
చట్టాలపై అవగాహన కలిగి న్యాయ విజ్ఞాన సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి తిరుపతి అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తోరూర్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుతోపాటు ప్రతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి ఎదిగినప్పుడే చట్టాలు అర్థమవుతాయని అన్నారు అందుకోసం ప్రతి విద్యార్థి గురువులు బోధించిన పాఠాలు సక్రమంగా విని ప్రత్యేక శ్రద్ధతో పరీక్షలు రాసి మంచి మార్కులు పొంది ఉన్నంత ఉద్యోగ స్థాయికి ఎంపికై సమాజానికి తోడ్పడాలన కోరినట్లు తెలిపారు అంతేకాకుండా ముఖ్యంగా బాలికలను కొంతమంది మాయమాటలు చెప్పి మోసగిస్తారని అన్నారు అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ సిబ్బందికి మీ పరిస్థితిని వారికి అర్థమయ్యే విధంగా చెప్పి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు ముఖ్యంగా చట్టాలు తిలకపోవడంతోని చాలామంది అవగాహన లోపంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు అందుకోసం మీకు ఈ కార్యక్రమాన్ని చట్టాలపై అవగాహన తీసుకొస్తున్నామని తెలిపారు ముఖ్యంగా బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని తెలిపారు ఇంకా భూ తగాదాలతో అనేకమంది కేసుల పాలవుతున్నారని అలా కాకుండా చూసుకోవాలని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు విచ్చలవిడిగా వాడుతున్నారని అలా కాకుండా మీకు అవసరమయ్యే రీతిలోనే తక్కువ సెల్ఫోన్ ఉపయోగించుకోవాలని తెలిపారు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం తెలియజేయాలని అన్నారు సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రాము ఏఎస్ఐ కందునూరి వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడు ఖలీదు అహ్మద్ న్యాయవాదులు బాలు లింగాల శ్రీనివాస్ ఘనపురం రామకష్ణ మహిళా పాక అశోక్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.