Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలం వ్యవసాయ మార్కెట్లో మేడే ను విజయవంతం చేయాలని కోరుతూ ఏఐసిటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల వద్దకు వెళ్లి నేరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు కంచ వెంకన్న మాట్లాడుతూ కార్మికులు రక్తం చిందిస్తేనే హక్కులు సాధించబడ్డాయని వాటి పరిరక్షణ కొరకు ఐక్యంగా ఉద్యమించినప్పుడే అవి కాపాడబడతాయని కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులు కూడా వెనుకడుగు వేస్తారని ఆ విధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల కొరకై ఐక్యంగా ఉద్యమించాలని ఆయన అన్నారు. అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టం కొరకు కూడా పోరాటానికి సంసిద్ధం కావలసిన తరుణం ఆసన్నమైందని ఇదే స్ఫూర్తితో కార్మికులందరూ మే డే లో ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బానోత్ కిషన్, సామ వెంకన్న, వేల్పుల వెంకన్న ,సామ ప్రభాకర్ రెడ్డి, ఆంగోతు లక్ష్మణ్, ధారావత్ వీరన్న, ఆది లక్ష్మణ్, ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు జాటోత్ బిచ్చ నాయక్ గిరిజన సంఘం మండల నాయకులు బానోత్ మంగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.