Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొర్రూరు ఎంపీపీ అంజయ్య పిఎసిఎ చైర్మన్ హరి ప్రసాదరావు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు,సర్పంచ్ గుంటుక యాదలక్ష్మి తో కలిసి పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అన్నదాతలకు మేలు చేయాలని 'ఏ' గ్రేడ్ రకానికి రూ.2,060, మామూలు రకానికి రూ.2,040 మద్దతు ధర అందచేస్తున్నారని ఈ విషయంలో రైతులెవరూ బయట ధాన్యం అమ్మకాలు చేయకుండా మద్దతు ధర ఎక్కువగా వచ్చే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని కోరారు. రైతులు వడ్లు ఆరబోసి తాలు లేకుండా 17శాతం తేమ వచ్చేలా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా రైతుల పక్షపాతి అని, రౖతులకు 24 గంటల విద్యుత్, పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ళు చేసిన 48 గంటల్లో (రెండు రోజుల్లో)నే వారి ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరుగుతుందని, ఈ విషయంలో నిధుల కొరత ఏ మాత్రంలేదని స్పష్టం చేశారు. రైతులకు మంచి చేసే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉండగా ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం ఏ మాత్రంలేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఈఓ మురళి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఉపాకర్ రెడ్డి,నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.