Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ-మహబూబాబాద్
సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని ఐకెపి వివోఏలు చేపట్టిన న్యాయబద్ధమైన నిరవధిక సమ్మె పట్ల టిఆర్ఎస్కెవి అనుబంద విఓఏ సంఘం నాయకులు అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని లేకపోతే విఓఏల ఆగ్రహానికి గురికాక తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ తెలిపారు. శుక్రవారం నీలం కష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఐకేపీ వివోఎ జిల్లా స్ట్రగుల్ కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ లు పాల్గొని ప్రసంగిస్తూ గత పది సంవత్సరాలుగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న విఓఏల బాధలను పట్టించుకోక పోవడం వల్లనే అనివార్య పరిస్థితులలో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. వివోఎల పట్ల చిత్తశుద్ధి ఉంటే సమ్మెలోకి కలిసి రావాలి గాని ఇలా తప్పుడు ప్రచారం చేయడం, సమ్మె విచ్చిన్నానికి పూనుకోవటం తగదన్నారు. అనేక త్యాగాలు, సకలజనుల సమ్మెలు నిర్వహించడం ద్వారానే తెలంగాణ సాధించుకున్న విషయాన్ని మర్చిపోయి నేడు సమ్మేల పట్ల చులకన భావం ప్రదర్శించడం, హేళనగా మాట్లాడటం అవివేకమన్నారు. జిల్లా వ్యాప్తంగా సమ్మె జరుగుతూ రోజు వారీగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, అనేక మంది పెద్దలు, వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్న సమ్మె జరగటం లేదని ప్రచారం చేయడం అంటే వివోఏల సమ్మెను, సంఘీబావాలను కించపరచడమేనని వారు అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం, సమ్మెలో పాల్గొనకుండా వివిధ రకాలుగా ఒత్తిడికి గురిచేయడం లాంటి చర్యలు మానుకోకపోతే వివోఏల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే సమ్మెనం మరింత ఉధతం చేస్తామని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో విఓఏ యూనియన్ జిల్లా కన్వీనర్ చింత మౌనిక నాయకులు సుధాకర్, శోభారాణి, లలిత, పవన్, శ్రీలత, వసంత, కుమారి, శ్రీను, అశోక్, హన్మంతు, ఉమారాణి, సైదులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : గ్రామాలలో వివోఏలుగా విధులు నిర్వహిస్తున్న వారిని చిన్న చూపు చూస్తే ప్రభుత్వాన్ని గద్దె దించుడు తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిపారు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఐకెపి వివో ఎలా సమ్మె చెవిలో పువ్వు పెట్టి నిరసన ఐదవ రోజు చేరుకోవడంతో సిఐటియు మండల శాఖ సంఘీభావం తెలి పే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకెపి సర్ఫ్ కార్యాలయంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళ గ్రూపులకు అవగాహన కల్పిస్తూ వారికి సంబంధించిన రికార్డులను రాస్తూ వివో ఏలుగా చాలీచాలని వేతనాలతో సుమారు 20 సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ చేయించుకోవడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు బొల్లం ఎల్లయ్య వివోఏల మండల అధ్యక్షుడు గూగులోతు హనుమంతు నాయక్ బాలాజీ శ్వేత ఉష విజయలక్ష్మి హైమావతి సరిత ఉపేందర్ శ్రీను స్వప్న విజయ విజయ రేణుక సుజాత రమేష్ అశోక్ యాకమ్మ బండి మంజుల తదితరులు పాల్గొన్నారు.