Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం:
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఐకెపి వివోఏల సమ్మె శుక్రవారం ఐదవ రోజు కొనసాగింది. ఈ సమ్మెలో పాల్గొన్న వివోఏలకు కుంజ విజయ అరటిపళ్ళు అందజేయడం జరిగింది. వారికి ఐకెపి వివోఎల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.
నవతెలంగాణ-గూడూరు
విఏఓలు చేపడుతున్న నిర్వాదిక సమ్మె ఐదవ రోజుకు చేరింది చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ , చేరుకుని సంఘీభావం తెలిపారు ఈ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటామన్నారు ఈ సంఘీభావంలో మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చెలుపురి వెంకన్న ,మానుకోట జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాంబాబు నాయక్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు మెరుగు మల్లయ్య , గూడూరు మండల ప్రధాన కార్యదర్శి రాసముల్ల వెంకటేశ్వర్లు , సీనియర్ నాయకులు పడాల నాగరాజు , వీ ఎ వో ల మండల యూనియన్ అధ్యక్షురాలు దారం శ్రీలత , కోశాధికారి మల్లె పోయిన శ్రీలత , క్లస్టర్ బాధ్యులు ఏ కళ్యాణ్ , కే లక్ష్మయ్య , కే సుగుణ ,కే మల్లేష్ ,వి వెంకటలక్ష్మి , వి రాజు, బి రమేష్ లు పాల్గొన్నారు.