Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు సభ్యుల అరెస్టు ఐదు సెల్ ఫోన్లు 8 లక్షల నగదు స్వాధీనం
- ఎస్పీ శరత్ చంద్ర పవర్
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగు పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి ఎనిమిది లక్షల నగదును స్వాధీన పరుచుకు నీ ఐదు సెల్ ఫోన్ సీజ్ చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు ఎస్పీ కథనం ప్రకారం క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతూ యువతను దోచుకుంటూ తప్పుదోవ పట్టిస్తున్న ఐదుగురిని చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసినట్టు తెలిపారు అరెస్టు అయిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంచి చర్ల కు చెందిన కోసం శ్రీనివాస్, ఖమ్మం పట్టణానికి చెందిన చైతన్య మానుకోట పట్టణం ఎన్జీవోస్ కాలనీ చెందిన కాటం సుధాకర్ మానుకోట పట్టణం బెస్త బజారు చెందిన మల్లం వంశీకష్ణ మహబూబాబాద్ పట్టణం బస్టాండుకు చెందిన ఎండి రిజ్వాన్ ఉన్నారు పరారీలో ఉన్న వారి లో గుంటూరుకు చెందిన వంగినేని చిరంజీవి మహబూబాబాద్ కు చెందిన బత్తిని ఉదరు శ్రీకాంత్ యాదవ్ ఉన్నారని ఎస్పీ కలిపారు వారి వద్ద ఐదు సెల్ ఫోన్లు 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు
ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సంతోష్, రమేష్, వెంకన్న, కోటేశ్వరరావు, రామకష్ణ, దిలీప్, వీరస్వామి, వీణ,షఫీ సుమన్ నాగరాజు లను అభినందించి, రివార్డ్ అందచేసినట్లు ఎస్పీ తెలిపారు.