Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ అధికారులు,సిబ్బంది నిరంతరం కృషి చేయాలి
- పెండింగ్ కేసులపై నెల వారి నేర సమీక్ష సమావేశం
- జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లా లోని ఆయ పోలీస్ స్టేషన్ల లో నమోదు అవుతున్నా కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వార పారదర్శకమైన విచారణ చేపట్టాలని , కేసు నమోదు నుండి చార్జి షీట్ వరకు ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి ఫైనల్ చేయాలనీ లిజిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో బాగంగా పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఏ ఏ అంశాలు కోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని అన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలని, పెండింగ్ లో ఉన్న దొంగతనం కేసులలో పురోగతి సాధించాలని అదేశించారు. కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలనీ, పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. సిసిటిఎన్ఎస్ లో డాటా ఎంట్రీ ప్రతిరోజూ మానిటర్ చేయాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. రోడ్డు ప్రమాదాలు ,సైబర్ నేరాల నియంత్రణ గురించి పోలీస్ కళా బందం ద్వారా గ్రామాలలో ప్రజలకు విరివిగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్ సిబ్బంది తో నిరంతరాయంగా ప్రోయాక్టివ్ గా గస్తీ నిర్వహించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అదించడానికి అదికారులు, సిబ్బంది నిరంతరం కషి చేస్తూ ఉండాలనీ సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు దారుని పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, ప్రతి పిర్యాదు పై పారదర్శకంగా విచారణ చేపట్టి వెంటనే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ జొగుల చెన్నయ్య,మహబూబాబాద్ ఇంఛార్జి డిఎస్పీ రమణ బాబు,ఎస్.బీ ఇన్స్పెక్టర్ ఫణిధర్, డి.సి.అర్.బి ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్ , సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,జిల్లా పరిధి సీఐలు, ఎస్ఐలు ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా ఇఫ్తార్ విందు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని మసీదులో రంజాన్ వేడుకను పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి తెలిపారు శుక్రవారం మండల కేంద్రంలోని ఇఫ్తార్ విందులో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు తో కలిసి పాల్గొని మాట్లాడుతూ ముస్లింల రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని అన్నారు ప్రభుత్వం వీరికి నూతన దుస్తులను ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గత పాలకులు ఎవరు పట్టించుకున్న దాఖలు లేవని కెసిఆర్ పాలనలోనే సంబండ జాతులకు సకల వసతులను కలిగించిన ప్రభుత్వం అధి కేవలం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు ఈ మసీదులోని కబ్రిస్తానుకు ప్రహరీ గోడను నిర్వహించేందుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఒప్పించి త్వరలోనే పనులు చేయించేందుకు కృషి చేస్తానన్నారు నా ఇఫ్తార్ విందుకు సహకరించిన ప్రభుత్వానికి జిల్లా మండల నాయకులకు కృతజ్ఞతలు అని మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి రహిమాన్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి ఎంపీటీసీ వెన్నాకుల వాణి శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరిపాటి వెంకటరెడ్డి మత పెద్ద అబ్దుల్లా మండల కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రహమాన్ వెంకటేశ్వరపురం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ నాయకులు పులి రామచంద్ర ఆదిరెడ్డి ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
24న ఖమ్మం లో జరిగే
నిరుద్యోగ దీక్ష కు వేలాదిగా తరలి రండి
నవతెలంగాణ-గార్ల
ఈ నెల 24న కాంగ్రెస్ అధ్వర్యంలో ఖమ్మం లో జరిగే నిరుద్యోగ నిరసన దీక్షకు నిరుద్యోగులు వేలాది గా తరలి దీక్ష ను జయప్రదం చేయాలని మాజీ ఎంపిపి, ముల్కనూరు ఎంపిటీసి మాళోత్ వెంకట్ లాల్ కోరారు. స్దానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటి కొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన సియం కేసీఆర్ కనీసం ఊరుకి ఒక ఉద్యోగం కూడా ఇవ్వ లేదని ఎద్దేవా చేశారు.రెండవ సారి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భతి ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యల పై జరుగుతున్న ఈ దీక్షలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు టి.కష్ణ గౌడ్, షంషాద్ బేగం,జవహర్ లాల్ నెహ్రూ, కమలా ఉన్నారు.
ప్రభుత్వ టీచర్ పై
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి...
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
ఆకారణంగా ప్రభుత్వ టీచర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీఎస్ యుటిఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మురళీకష్ణ అన్నారు. శుక్రవారం తొర్రూర్ లో దాడికి గురైన టీచర్ ఉడుగుల వెంకటేశ్వర్లను పరమార్శించి అనంతరం వారు మాట్లాడుతూ, నరసింహుల పేట మండలం పడమటి గూడెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, గురువారం స్కూల్ కు వెళ్లి విధులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తుండగా తొర్రూర్ మండలం పత్తేపురం గ్రామ శివారులో బాలమైసమ్మ గుడి దగ్గర బండి మీద వస్తున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు బండిని ఆపి అకారణంగా తిట్టి దాడి చేసి కొట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రతా లేకుండా పోతుందని అన్నారు పోలీస్ శాఖ వెంటనే స్పందించి దాడికి పాల్పడినటువంటి వాళ్లను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని టిఎస్ యుటిఎఫ్ మహబూబాబాద్ జిల్లా కమిటీ పక్షాన వారు కోరారు.