Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు శనిగపురం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి మార్నేని వెంకన్న, నాయిని రంజిత్, గద్దె రవి, రాజు, ఉపేంద్రమ్మ, వెంకట్ రెడ్డి, మల్లయ్య, కౌన్సిలర్లు హరిసింగ్, శ్రీను, శంకర్ పాల్గొన్నారు.
ప్రతీ వార్డును అభివృద్ధి చేస్తాం
మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివద్ధి చేస్తానని అన్ని వార్డులకు సమాన సౌకర్యాలు కలిగించడానికి కషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో లోని 9,10 వార్డులలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించి కార్యకర్తలు ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు కేటాయించిన 50 లక్షల రూపాయలతో వార్డులో అభివద్ధి పనుల ఎంపిక కొరకు వార్డుల పరిధిలోని శనిగపురం పలు తండాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని నమోదు చేసుకొని చేయవల్సిన అభివద్ధి పనులను ప్రజల సమక్షంలో ఎంపిక చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి , మార్నేని వెంకన్న, గద్దె రవి, నాయిని రంజిత్, రాజు నాయక్, పద్మం ఉపేంద్రమ్మ, వెంకట్ రెడ్డి, తోట మల్లయ్య, బానోత్ రాము, స్థానిక కౌన్సిలర్లు బానోత్ హరిసింగ్, భూక్య శ్రీను, డౌలాగర్ శంకర్, చుక్క శ్రీను పాల్గొన్నారు.