Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళ పల్లి
వచ్చే ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని టి పి సిసి సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పోతుగళ్ళు,ఇప్పలపల్లి, అకిన పల్లి, పర్లపల్లి గ్రామాల్లో కొనసాగిన హాత్ సే హాత్ జోడో యాత్రలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో సత్యనా రాయణ రావు పాల్గొని మాట్లాడారు.దేశాన్ని దోచుకో వడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని దోచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతున్నాయన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆ ర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని వచ్చే ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలకు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాల న్నారు.యాత్రలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అంద జేశారు. యాత్ర మధ్యలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల, రైతుల ఆకలి చావులు, ఆత్మహత్యలు సామాన్య ప్రజల నెత్తిపై అప్పులు తప్ప ఎలాంటి ప్రయోజనాలు కలగలేదన్నారు ఈ నాయకులకు పర్సంటేజీల మీద ఉన్న ధ్యాస గ్రామాల అభివద్ధిపై లేదని విమర్శిం చారు. అవినీతిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే బొంద పెడతా రన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో అక్రమ సంపాదన ఎంత ఖర్చు పెట్టినా ప్రజలు ఓటేసే పరిస్థితి లేదన్నారు.ఎన్నికలెప్పుడొచ్చినా, భూపాలపల్లి లో ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు ఆకుతోట కుమారస్వామి, మండల మాజీ కో ఆపరేటివ్ చైర్మన్ పోలినేని లింగారావు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బండి సుదర్శన్ గౌడ్,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు వొనపాకల ప్రసాద్ మండల ముఖ్య నాయకులు తక్కళ్ళపల్లి రాజు, మండ రవి, మల్సాని రాజేశ్వర్ రావు, పడిదల ప్రకాష్ రావు, నడిగోటి రాము, వొనపాకల లింగయ్య లతో పాటు ఆయా గ్రామాల అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.