Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఓ పీడీకి వినతిపత్రం
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వీఓఏలు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదని డీఆర్డీఓ పిడి పురుషోత్తంకు విఓఏ సంఘం జిల్లా కమిటీ శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో విఓఏ సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధంగా కొన్ని జిల్లాలో గత నెల రోజుల నుండి వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. ఆయా జిల్లాల విఓఏ ఉద్యోగులు నిరవదిక సెమ్మ చేస్తున్నారు. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టిఆర్ఎస్కేవి అనుబంధంతో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు మారేపల్లి మాధవి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా సమస్యల పరిష్కారానికి వెళ్ళాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి, మండలాల వీఓఏ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదని వినతి పత్రంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాజుల రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వైద్య శ్రీనివాస్, కోశాధికారి శ్రీరామ్ తిరుపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మడి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్ర రమేష్, టేకుమట్ల, చిట్యాల ,మండల అధ్యక్షురాళ్ళు సుమతి, రజిత, చిట్యాల మండల కోశాధికారి గుర్రం రామస్వామి, నాయకులు పులి మహేష్, అనిల్, పద్మ, శైలజ, విజయ, అజ్మీర రాజు, బండారి రమేష్ పాల్గొన్నారు.