Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌పై సర్వీసుతో కూడిన జిఓ విడుదల చేయాలని, పంచాయతీ కార్యదర్శుల శాంతియుత నిరవధిక సమ్మె ప్రారంభించారు. శుక్రవారం నర్మెట్ట మండ ల కేంద్రం ఎంపిడివో కార్యాలయం ముందు శాంతియుతం గా సమ్మెను నిర్వహించారు.నర్మెట్ట జూనియర్ కార్యదర్శిలు మాట్లాడుతూ ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌పై సర్వీసుతో కూడి న జిఓ విడుదల చేయాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని పంచాయతీ కార్యదర్శులు అన్నారు.ఈ కా ర్యక్రమంలో కార్యదర్శులు వంశీ, సుఖేష్ గిరి, అనిల్, నరేష్, శ్రీధర్, యాకోబ్, కళ్యాణి, సుజాత, వినరు, పాల్గొన్నారు.
చిన్నగూడూరు : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని మండల కార్య దర్శులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిరవధిక సమ్మె చేప ట్టారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల ప్రోబేషనరీ కాలం పూర్తి అయి నాలుగేళ్లు అవు తున్న తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో జా రీ చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఇకనైనా ప్రభు త్వం స్పందించి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తూ జీ వోను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రా మాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గార్ల : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభు త్వం ఇచ్చిన క్రమబద్దీకరణ హామీలను నెరవేర్చడానికి కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, పి.సో మయ్యలు డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్య దర్శులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతు న్న సమ్మెలో భాగంగా స్దానిక ఎంపిడివో కార్యాలయం ఆవ రణంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిర వధిక సమ్మెకు శుక్రవారం సంఘిభావం తెలిపి మాట్లాడా రు. ప్రతి గ్రామ పంచాయతీలకు ఒక కార్యదర్శిని ఏర్పాటు చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారి చేత అన్ని రకాలైన పంచాయతీ పనులను చేయించిందని చెప్పారు.అదనపు భారంగా జాతీయ ఉపాధి హామీ పనుల ను అప్పగిస్తే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమర్థ వంతంగా ఉపాధి హామీ పనులు చేసారని అలాంటి జూని యర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని డి మాండ్ చేశారు. మూడు సంవత్సరాల తరువాత క్రమబద్ధీక రణ జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం నాలుగేళ్ళు గడుస్తున్న వారిని క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు.తక్షణమే జూనియర్ పంచాయతీ కార్యదర్శు లను క్రమబద్ధీకరించి ప్రభుత్వం మాట నిలుపుకోవాలన్నా రు. సంఘిభావం తెలిపిన వారిలో సీపీఎం, న్యూడెమోక్రసి పార్టీల మండల కార్యదర్శులు కందునూరి శ్రీనివాస్, గుగు లోత్ సక్రులు ఉండగా, సమ్మెలో పాల్గొన్న వారిలో కిషన్ నా యక్,సరిత, క్రాంతి కుమార్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రమే ష్, కిరణ్, మంగిలాల్, అనిల్, కుమార్, నరసింహారావు, సురేందర్, రాజేందర్, మహేష్, లలిత, సరస్వతి, కిరణ్, కిషోర్, అభిలాష్ తదితరులు ఉన్నారు.
పెద్దవంగర : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శుక్రవా రం ఎంపీడీవో కార్యాలయం ఎదుట మండలానికి చెందిన జేపీఎస్‌లు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జేపీఎస్‌ల ప్రొబెషనరీ గడువు ఈనెల 11 తో పూర్తయిందని, అయినప్పటికీ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ గురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం దారుణమ న్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ తక్షణం జీవో విడుల చేయాలని కోరారు. నాలుగేళ్ల ప్రొబెషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శు లందరినీ జేపీఎస్‌లుగా ప్రమోట్ చేయాలని. రాష్ట్ర వ్యాప్తం గా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ధారించాల న్నారు. మరణించిన జేపీఎస్‌ల కుటుంబాలకు కారుణ్య ని యామకాలు చేపట్టాలన్నారు. అర్హులైన సీనియర్ పంచా యతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని, 317 జీవో వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చే యాలని, పరస్పర, స్పౌస్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మం డల ప్రధాన కార్యదర్శి మహేష్, మండల ఉపాధ్యక్ష్నురాలు పావని, వీరన్న, రవి, రాజు, మణికుమార్, గీత, రమాదేవి, రజిత, హేమలత తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండలంలోని పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం తెలియజేయ డం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూని యర్ పంచాయతీ కార్యదర్శిలను మొదట మూడు సంవత్స రాలు ప్రొబేషనరీ పీరియడ్‌తో 15 వేల రూపాయల జీతాని కి తీసుకున్నారని, ఆ సమయం పూర్తైన తరువాత 2022లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మరో సంవత్సరం పొడిగిస్తూ జీతం పెంచి రెగ్యులర్ చేస్తామని జీవో నెంబర్ 26 ద్వారా తెలియజేశారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం 4 సంవత్సరా లు పూర్తి అయిన కూడా రెగ్యులర్ చేయకపోవడంతో పంచా యతీ కార్యదర్శులు 15రోజులు గడువు ఇచ్చి తమని రెగ్యుల ర్ చేయకపోతే సమ్మెకు వెళ్తామని ముందే సమ్మె నోటీస్ ఇవ్వ డం జరిగిందని, అయినా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మెకు దిగినట్లు తెలిపారు.ఈ కార్య క్రమంలో మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గూడూరు : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గూడూరు మండల పరిషత్ కార్యాలయం ముందు మండలంలోని జూనియర్ గ్రామపం చాయతీ కార్యదర్శులు శుక్రవారం నిర్వాదిక సమ్మెను చేపట్టా రు. మండలంలోని 28 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో పాల్గొన్నారు. 4 సంవత్సరాల ప్రోహిబిషన్ పీరియడ్ పూర్తయిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవో జారీ చేయాలని కోరారు. సమ్మెకు సీనియర్ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు ఆలీ సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమం లో జెపిఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ రమేష్ వైస్ ప్రెసిడెంట్ రేణుక, రాజులు పాల్గొన్నారు.