Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-మట్టెవాడ
పేద గుడిసె వాసులకి పట్టాలు ఇప్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెం.58,59లను తీసుకువచ్చారని ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్క పేదవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రజలను కోరారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 11వ డివిజన్ పోతననగర్‌లో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ లతో కలిసి గుడిసె వాసుల ప్రతి ఇల్లిల్లు కలియ తిరిగారు. వారితో ముచ్చటిస్తూ 58 ,59 జీవో కు సంబంధించిన వివరాలను వివరిస్తూ ప్రతి ఒక్కరు మీ సేవలో 58, 59 జీవోపై దరఖాస్తు చేసుకోవాలని సుచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద గుడిసె వాసుల నివాస స్థలాలకు పట్టాలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన జీవో నెంబర్ 58, 59 పేద గుడిసె వాసులకు ఒక వరం లాంటిదని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో గత కొన్ని ఏళ్లుగా ఉంటున్నప్పటికీ పట్టాలు లేవని , అంతకు ముందు ప్రభుత్వాలు పట్టాలు పంపిణీ చేయనేలేదని అలాంటి పేద వారి ఇళ్లకు భరోసా ఇచ్చే విధంగా కెసిఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గడువు లోపు పేద గుడిసె వాసులు 58 59 జీవోలపై దరఖాస్తు తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కల్పలత సూపర్ బజార్ ఉపాధ్యక్షులు షఫీ, టిఆర్ఎస్ నాయకులు సదన్త్, డివిజన్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.