Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
రాష్ట్ర ప్రభుత్వానికి సోకులపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని, అకాల వర్షాలతో అన్నదాతలు విలవిలలాడుతుంటే చోద్యం చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మం డలంలోని సింగరకుంటపల్లి, పాపయ్యపల్లి, నర్సాపూర్ గ్రామాలలో అకాల వర్షంతో నష్టపో యిన పంటలను మండల అధ్యక్షుడు భూక్య జవ హర్లాల్తో కలిసి బీజేపీ నాయకులు పరిశీలిం చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భాస్క ర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జింకల కృష్ణాకర్ రావు మాట్లాడారు. అకాల వర్షాలతో వేలాది ఎక రాల్లో వరి పంట దెబ్బతిందని, మిర్చి, పుచ్చ, మొక్క జొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఓదార్చాల్సింది పోయి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయాల్సిన అగ్రి కల్చర్ ,హార్టికల్చర్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తు న్నారని అన్నారు. తీరు మార్చుకుని రైతులకు న్యాయం చేసేలా పని చేయాలని కోరారు. లేదంటే పోరాటాలు చేస్తామన్నారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి, సీనియర్ నాయకులు ప్రేమ్ సింగ్ గొల్లపల్లి రవి ధర్మయ్య కవ్వాల శ్రీనివాస్, రైతులు పొలాల రాజిరెడ్డి, గోపు దేవేందర్ రెడ్డి, బిల్ల రమేష్ ,కారకురి ఓదెలు, ఏలూరి సదయ్య ,పుప్పాల చిన్న వీరయ్య, గోపు రమేష్, గోపు భద్రయ్య, మైదం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.