Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజిఎస్)రాష్ట్ర మూడవ మహా సభలు భద్రాచలం లో జరగనున్నాయి. మహా సభల రేలా పండు ఆదివాసీ సాంస్కతిక ఉత్సవాలు, బహి రంగ సభల గోడ పత్రికలను వాజేడు మండలం లో తెలం గాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ ఆదివాసీలు సాగులో వున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని(టీఏజిఎస్) ఉద్యమించిందని, సంఘం ఆధ్వర్యంలో 2016నుండి 2022వరకు పెండింగ్ తునికాకు బోనస్ సాధించినట్లు తెలిపారు. ఖాళీగా వున్న ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయాలని, జనాభా ప్రాతిపదికన 8.5శాతం ఎస్టీలకు సంక్షేమానికి కేటాయించాలన్నారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రయివేట్ పరిశ్రమలలో గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు. ఇందుకు భద్రాచలం లో జరిగే మహా సభలలో కార్యాచ రణ ప్రకటిస్తారరని అన్నారు. సంఘం మండల కార్యదర్శి జెజ్జరీ దామోదర్,బచ్చల కష్ణ బాబు,రాజేష్, ప్రభాకర్, సందీప్, రమాదేవి, సీత, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.