Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ - ములుగు
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని వాటికి కారణాలు ఉంటే ప్రజలకు తెలియపరచాలని ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉండొద్దని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠీ అధికా రులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ వైవి గణేష్ డిఆర్ఓ కె రమాదేవితో కలిసి ప్రజా వాణి దరఖాస్తులను స్వీకరించారు. కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. ప్రజావాణిలో ధరణి 4, డబుల్ బెడ్ రూమ్ 3, పెన్షన్ ఒకటి, ఇతర సమస్యల పై 8, మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా అద నపు కలెక్టర్ మాట్లాడుతూ... వివిధ శాఖల్లో పెండింగ్ ఉన్న అర్జీల వివరాలు తెలుపుతూ ఆన్లైన్ లో పెండింగ్లో ఉండొదని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల హాజరు తప్పనిసరి ములుగు వెలుగులో యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సంబం ధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రసూన రాణి, జిల్లా వైద్యాధికారి ఏ అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, సీపీఓ ప్రకాష్, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డీసీఓ సర్దార్ సింగ్, విద్యాశాఖ అధికారి పానిణి, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్, డీపీఓ వెంకయ్య, డిఎస్ఓ అరవింద్ కుమార్ రెడ్డి, డిఎం శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.