Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్క రించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యా లయం ముందు చేస్తున్న పంచాయతీల కార్యదర్శిల సమ్మె సోమవారం నాలుగవ రోజు కొనసా గింది. సమ్మెకు జీఎస్ ఆర్ సంఘీభావం తెలిపి మాట్లా డారు. పంచాయతీ కార్యద ర్శులను నాలుగు సంవత్స రాలుగా వెట్టి చాకిరి చేయించుకొని వారిని నట్టేట ముం చాడన్నారు. పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇబ్బం దులకు గురిచేస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వైస్ ఎంపీపీ అశోక్, మాజీ జడ్పిటిసి ముత్యాల రాజయ్య, జోడు ప్రదీప్. పోశాల మహేష్, పంచాయతీ కార్యదర్శులు శరత్, పుప్పాల శ్రీకాంత్, ముక్కెర హేమంత్, సాయిని రమేష్, శఫీ, రాజు, అజరు, నరేష్, రాకేష్, నవీన్, శ్రావణి, దివ్య శ్రీ, సరిత, గౌతమి, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి : వైస్ ఎంపీపీ
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరి ష్కరించాలని వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు చేస్తున్న పంచా యతీల కార్యదర్శిల సమ్మె సోమవారం నాలుగవ రోజుకు చేరుకుంది. సమ్మెకు వైస్ ఎంపీపీ అశోక్ సంఘీ భావం తెలిపి మాట్లాడారు. శరత్, పుప్పాల శ్రీకాంత్, ముక్కెర హేమంత్, సాయిని రమేష్, శఫీ, రాజు, అజరు, నరేష్, రాకేష్, నవీన్, శ్రావణి, దివ్య శ్రీ, సరిత, గౌతమి, తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ల ఫోరమ్ సంఘీభావం
మల్హర్రావు : జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాని ఏప్రిల్ 28వ నుంచి జేపీఎస్,ఓపిఎస్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె చేపడుతున్న విషయం తెలి సిందే. సోమవారం నాటికి సమ్మె నాలుగవ రోజుకు చేరింది. మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కు మండల సర్పంచ్ల ఫోరమ్ సంఘీభావం ప్రకటించి సంపూర్ణ మద్దతు తెలిపింది. సర్పంచ్లు పంచా యతీ కార్యదర్శులతోపాటు సమ్మె వేదికపై కూర్చుని, ప్లకా ర్డులతో నిరసన తెలిపారు. సమ్మె ఇలాగే కొనసాగితే జీపీల పాలన స్తంభించి, పల్లెల ప్రగతి కుంటుపడుతుం దన్నారు. వారి డిమాండ్లన్ని నెరవేర్చాలన్నారు.
పర్మనెంట్ చేయాలి : ఎంపీపీ
కాటారం : గ్రామపంచాయతీ కార్యదర్శులను పర్మి నెంట్ చేయాలని కాటారం మండల పరిషత్ అధ్యక్షులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం ఉపాధ్యక్షులు పంతకాని సమ్మయ్య అన్నారు. కాటారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరి కాలాన్ని సర్వీసు కాలంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. మరణించిన జూనియర్ కార్యదర్షుల కుటుంబాలను ఆదు కోవాలని, కారుణ్య నియా మకాలు చేపట్టాలని కోరారు. మండలశాఖ అధ్యక్షులు నాగరాజు, జిల్లా నాయకులు బీరెల్లి కరుణాకర్, శ్రీనివాస్, వేణుగోపాల్, రజిత, నవ్య, జోష్ణ, కష్ణవేణి, అపర్ణ, శివ, సతీష్, ప్రసన్న, సునీత, శ్రీనివాసు పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి : మండల సర్పంచుల ఫోరం
చిట్యాల: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని సమస్యలను వెంటనే పరిష్క రించాలని కోరుతూ చేపట్టిన సమ్మెకు మండల సర్పం చుల ఫోరం సంపూర్ణ మద్దతు తెలిపింది సోమవారం వారితో సమ్మెలో పాల్గొన్న మండల సర్పంచులు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కామిడీ రత్నాకర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె నాలుగవ రోజుకు చేరింది. సర్పంచుల మండల ఫోరం మద్దతు తెలిపింది. పంచాయతీ కార్యదర్శులను రెగ్యు లరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులతో పాటు సమ్మె వేదికపై కూర్చుని ప్లకార్డ్స్ ప్రదర్శించి మద్దతు తెలిపారు. మండల అధ్యక్ష కార్యదర్శులు వినోద్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెగ్యులర్ చేయాలి : నెమలి నరసయ్య.
గోవిందరావుపేట : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని మాదిగ దండోరా జాతీయ నాయ కులు నెమలి నరసయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎమ్మార్పీఎస్ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టమైన హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్న నిర్లక్ష్యానికి రాష్ట్రరాజధాని హైదరాబాద్ దిగ్బం ధం తప్పదని హెచ్చరించారు. సీఎం ఇచ్చిన హామీ అమ లు చేయకుంటే ప్రభుత్వాన్ని దిగ్బంది స్తామన్నారు. ఎం ఆర్పిఎస్ మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా సీనియర్ నాయకులు కోకిల సాంబయ్య పాల్గొన్నారు.
రెగ్యులైజేషన్ చేయాలి : మాచపాక రమేష్
రేగొండ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న కార్యదర్శులను రెగ్యులరేషన్ చేయాలని పంచాయతీ కార్యదర్శిల అధ్యక్షులు మాచపక రమేష్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీఎస్ ఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపుమేరము మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు జూనియర్ పంచా యతీ ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు శాంతి యుత నిరవధిక సమ్మె చేపట్టారు. జీపీ కార్యదర్శుల న్యా యమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. సోమవారం సమ్మెకు పలువురు సర్పంచులు సంఘీభావం తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు సురేందర్ ,నవ్య, శ్రీకాంత్, మనోజ్, తిరుపతి, శంకర్, కుమర్, సునీల్ పాల్గొన్నారు.