Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వైవి గణేష్
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని కార్మిక గుర్తింపు పొందిన కార్డుదారులు ఉచితంగా చేసే వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక ఆత్మీయ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్మికశాఖ అధికారిని వినోద కార్మిక సంక్షేమ పథ కాలు వాటి వివరాలు భీమా సౌకర్యం వాటి నివేదిక వివ రించారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్యతో కలిసి జిల్లా అదనపు కలెక్టర హాజరై ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య పరీక్షల వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో 2,3 తేదీలలో గ్రామపంచాయతీ కార్యాల యంలో వైద్య పరీక్షలు చేస్తారన్నారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కార్మికులు కార్మిక శాఖ ద్వారా కార్మిక గుర్తింపు కార్డులు పొందాలన్నారు.అసంఘటిత కార్మికులు ఈశ్రమ్ కార్డు పొందాలన్నారు.తద్వారా ప్రమాద బీమా రెండు లక్షలు రూపాయలు, అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ... కార్మిక సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. వాటిని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. వైద్య శిబిరంలో సుమారు 50మంది కార్మికులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారిని వినోద, ఎక్సైజ్ ఏస్ఐ వెంకన్నచందు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జంపాల రవీందర్, డిప్యూటీ డిఆర్డిఓ శ్రీనివాస్, ములుగు తాహసిల్దార్ సత్యనారాయణ స్వామి, కార్మిక సంఘ నాయకులు శానబోయిన అశోక్, నర్సింగం, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.